ఎంసిఏ ఎక్క‌డ ఎండ్ అయిందో తెలుసా..?

MCA FINAL COLLECTIONS
యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన సినిమా కాస్తా ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ స్టేట‌స్ తో ముగిసింది. పాజిటివ్ టాక్ వ‌చ్చిన సినిమా కంటే మూడు రెట్లు ఎక్కువ‌గా వ‌సూలు చేసి త‌న స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు నాని. ఈయ‌న న‌టించిన ఎంసిఏ ఫైన‌ల్ ర‌న్ ముగిసింది. ఇక ఇప్పుడు పండ‌గ సినిమాలు రావ‌డంతో దాదాపు అన్నిచోట్ల క్లోజింగ్ షేర్స్ వ‌చ్చేస్తున్నాయి. నైజాంలో ఇప్ప‌టికే 14 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇది నాని కెరీర్ లోనే రికార్డ్. ఈగ రికార్డుల‌ను కూడా ఈ చిత్రం తిర‌గ‌రాసింది. నాని అదృష్టం.. సాయిప‌ల్ల‌వి అభిన‌యం.. దిల్ రాజు స్ట్రాట‌జీ.. ఇవ‌న్నీ క‌లిసి ఎంసిఏను సూప‌ర్ హిట్ చేసాయి. రొటీన్ క‌థే అయినా కూడా కుటుంబ ప్రేక్ష కులు ఈ చిత్రానికే క్యూ క‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు వారాల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 39 కోట్ల షేర్.. 68 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఒక్క‌క్ష‌ణం.. 2 కంట్రీస్ తో పాటు హ‌లో కూడా ఉన్నా అంద‌రి అడుగు మిడిల్ క్లాస్ అబ్బాయి వైపే ప‌డ్డాయి. ఓవ‌ర్సీస్ లోనూ మిలియ‌న్ మార్క్ దాటేసింది ఈ చిత్రం. 2017లో వ‌ర‌స‌గా మూడోసారి కూడా మిలియ‌న్ డాల‌ర్ సినిమా ఇచ్చి.. సౌత్ ఇండియాలో స‌రికొత్త రికార్డు సృష్టించాడు నాని. ఇప్పుడు విడుద‌లైన అజ్ఞాత‌వాసికి నెగిటివ్ టాక్ వ‌చ్చింది.. జై సింహా, గ్యాంగ్, రంగుల రాట్నం సినిమాలు ఈ వార‌మే వ‌స్తున్నాయి. దాంతో ఎంసిఏకు ఇకపై వ‌సూళ్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. మొత్తానికి 40 కోట్ల వ‌ర‌కు ఎంసిఏను బానే లాక్కొచ్చాడు న్యాచుర‌ల్ స్టార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here