ఎంసిఏ ప్ర‌మోష‌న్స్ లో సాయిప‌ల్ల‌వి ఎక్క‌డ‌..?

MCA first day
ఆమె తెలుగులో న‌టించింది రెండు సినిమాలే కావ‌చ్చు.. కానీ దానికి మించిన ఇమేజ్ సాయిప‌ల్ల‌వి సొంతం. అస‌లు ఓ హీరోయిన్ కు ఇంత‌గా ఇమేజ్ వ‌స్తుంద‌నే విష‌యం కూడా ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రూ అనుకోలేదు. ఫిదా సినిమాతో అంత మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఎంసిఏ విష‌యంలోనూ సాయిప‌ల్ల‌వి ఇమేజ్ బాగానే యూజ్ అవుతుంది. నైజాంలో ఈ చిత్రానికి ఇంత‌గా వ‌సూళ్లు వ‌స్తున్నాయంటే దానికి నాని ఇమేజ్ తో పాటు సాయిప‌ల్ల‌వి క్రేజ్ కూడా కార‌ణ‌మే. ఈ చిత్రం విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆప‌కుండా ప్ర‌మోష‌న్ చేస్తూనే ఉన్నాడు దిల్ రాజు. కానీ ఈ ప్ర‌మోష‌న్స్ లో ఎక్క‌డా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌ట్లేదు. ఫిదా టైమ్ లో మాత్రం ప్ర‌తీ చిన్న వేడుక‌కు వ‌చ్చిన ప‌ల్ల‌వి.. ఇప్పుడు మాత్రం ఎందుకు రావ‌డం లేద‌ని చాలా మందికి అనుమానం వ‌స్తుంది. దీని వెన‌క చాలా పెద్ద క‌థ ఉంద‌ని తెలుస్తుంది. షూటింగ్ టైమ్ లో నానితో సాయిప‌ల్ల‌వికి గొడ‌వ అయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీన్ని నాని కొట్టి పారేసాడు. కానీ అందులో నిజం లేక‌పోలేదంటున్నారు కొంద‌రు. నిప్పు లేనిదే పొగ రాదు క‌దా అన్న‌ట్లు గొడ‌వే లేక‌పోతే ఎందుకు ఇప్పుడు సాయిప‌ల్ల‌వి సినిమా ప్ర‌మోష‌న్స్ కు రావ‌డం లేద‌నే అనుమానం వ‌స్తుంది. దిల్ రాజు అంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేసిన ఆరు సినిమాల ఈవెంట్ కు కూడా సాయిప‌ల్ల‌వి రాలేదు. అస‌లు ఫిదా విజ‌యం సాధించిందంటే కార‌ణం సాయిప‌ల్ల‌వే. అలాంటిది ఆ సినిమా వేడుక‌కు కూడా రాలేదు ఈ భామ‌. దానికితోడు ఎంసిఏలో సాయిప‌ల్ల‌వి న‌టించిన సీన్స్ కొన్ని ఎడిట్ చేసార‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. ఇవి కానీ ఉండుంటే సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది. త‌న సీన్స్ కావాల‌నే తీసేసార‌ని సాయి ప‌ల్ల‌వి కూడా బాగానే హ‌ర్ట్ అయిన‌ట్లు తెలుస్తుంది. అందుకే ప్ర‌మోష‌న్స్ కు రావ‌డం లేదు ఈ భామ‌. ఇక నానితో గొడ‌వ కూడా ఈ భామ ఎంసిఏకు దూరంగా ఉండ‌టానికి ఓ కార‌ణ‌మై ఉండొచ్చ‌నేది ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వాద‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here