ఎన్టీఆర్ టైటిల్ అదేనంటారా..?


ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సూప‌ర్ ఫాస్ట్ గా జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్న‌డూ చూడ‌ని త్రివిక్ర‌మ్ ను ఇప్పుడు అభిమానుల‌కు చూపిస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. త‌న‌లో ఉన్న ఇంకో మ‌నిషికి ఇప్పుడు ప‌ని చెప్పాడు. లేక‌పోతే మ‌రేంటి.. రెండేళ్ల‌కో సినిమా చేసే త్రివిక్ర‌మ్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను మాత్రం వేగంగా పూర్తి చేస్తున్నాడు.
అక్టోబ‌ర్ లో రాజ‌మౌళి సినిమాకు ఎన్టీఆర్ వెళ్లాలి కాబ‌ట్టి డెడ్ లైన్ పెట్టుకుని మ‌రీ ప‌ని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా ముందు రోజే అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వనున్నారు చిత్ర‌యూనిట్. మే 19 సాయంత్రం ఫ‌స్ట్ లుక్ ప్ల‌స్ టైటిల్ విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. త్రివిక్ర‌మ్ ఆస్థాన నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
పూజాహెగ్డే ఇందులో హీరోయిన్. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ చిత్రానికి రారా కుమారా అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. సీమ‌లో ఉన్న త‌న ప్రేమ కోసం అక్క‌డికి వెళ్తాడు ఎన్టీఆర్. అందుకే స‌రిపోయేలా ఈ టైటిల్ అనుకుంటున్నార‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? ఎలా ఉండ‌బోతుందో ఈ టైటిల్..? అజ్ఞాత‌వాసి త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో త్రివిక్ర‌మ్ కు ఇది కీల‌కంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here