ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్.. అది నిజ‌మేనా..?

త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్ సినిమా అన‌గానే ప్రేక్ష‌కుల్లో తెలియ‌ని ఓ అంచ‌నాలు ఉంటాయి. ఆస‌క్తి కూడా ఉంటుంది. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే ఎలాంటి సినిమా వ‌స్తుంద‌నే క్యూరియాసిటి బోలెడు క‌నిపిస్తుంది. త‌మ కాంబినేష‌న్ పై అంచ‌నాలు ఎలా ఉంటాయ‌నేది ఎన్టీఆర్ కు కూడా తెలియ‌ని విష‌యం కాదు. పైగా ఎన్టీఆర్ ప‌క్కా మాస్ హీరో.. త్రివిక్ర‌మ్ కాస్త క్లాస్ ట‌చ్ ఉన్న ద‌ర్శ‌కుడు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమాపై ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో వార్త‌లు కూడా మొద‌లైపోయాయి. ప్ర‌స్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్.. మాట‌ల మాంత్రికుడి సినిమాపై నోరు మెద‌ప‌టం లేదు. ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుంది.. జోన‌ర్ ఏంట‌నే విష‌యంపై మాత్రం మాట్లాడట్లేదు. అయితే ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని కొత్త పాత్ర‌లో మాత్రం ఎన్టీఆర్ న‌టిం చ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.
త్రివిక్ర‌మ్ సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యం చెప్ప‌ట్లేదు కానీ ఎన్టీఆర్ లుక్ మాత్రం కొత్త‌గా ఉండ‌బోతుంది. ఈ విష‌యం స్వ‌యంగా ఆయ‌నే క‌న్ఫ‌ర్మ్ చేసాడు కూడా. త్రివిక్ర‌మ్ తో మాట్లాడి ఆయ‌న‌కు ఎలా కావాలో అలా మారిపోతానంటున్నాడు జూనియ‌ర్. ఈ లుక్ కోస‌మే కాస్త టైమ్ కూడా తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇది డిటెక్టివ్ డ్రామాగా తెలుస్తోంది. 80ల్లో వ‌చ్చిన ఓ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని స‌మాచారం. అ..ఆ సినిమాను కూడా య‌ద్ద‌న‌పూడి సులోచ‌నారాణి మీరా నుంచి స్పూర్థి పొంది సినిమా తీసాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మ‌రో న‌వ‌లకి తెర రూపం ఇవ్వ‌నున్నాడు. ఇప్ప‌టికే టాలీవుడ్ లో ఉన్న అగ్ర ద‌ర్శ‌కులంద‌రితోనూ ప‌నిచేసిన ఎన్టీఆర్.. ఒక్క త్రివిక్రమ్‌తోనే ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేయ‌లేదు. అదెందుకో కుద‌ర్లేదు. ఇన్నాళ్ల‌కు అది కుదిరింది. మార్చ్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. వ‌చ్చే ఏడాది ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here