ఎన్టీఆర్ బ‌యోపిక్ కు న‌టులు కావ‌లెను..!


అదేంటి.. ఎన్టీఆర్ లాంటి పెద్దాయ‌న బ‌యోపిక్ కు న‌టులు కావ‌లెను అని అడ‌గ‌వ‌లెనా.. అడిగిన వెంట‌నే అంతా వ‌చ్చును క‌దా.. దానికి ఇంకా అడ‌గ‌డం ఎందుకు అనుకుంటున్నారా..? ఏమో ఎవ‌రి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయో ఎవ‌రికీ ఎరుక‌..? ఇప్పుడు క్రిష్ బుర్ర‌లో కూడా ఇలాంటిదేదో తిరుగుతుంది. అందుకే ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం న‌టులు కావాలంటూ కాస్టింగ్ కాల్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా త‌నే నిర్మాత‌గా రూపొంద‌నున్న ఎన్టీఆర్ సినిమాలో న‌టించ‌డానికి గానూ న‌టులు కావ‌లెను..
ఔత్సాహికులు వ‌చ్చి త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకోండి అంటూ ఓ క్యాస్టింగ్ కాల్ విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. బ్ర‌హ్మ‌తేజ ప్రొడ‌క్ష‌న్స్ పై బాల‌య్యే ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే ఆయ‌న‌తో పాటు ఇంకా చాలా పాత్ర‌లు ఉంటాయి. నంద‌మూరి తార‌క‌రాముడి జీవితంపై ప్ర‌భావం చూపించిన పాత్ర‌లు చాలానే ఉన్నాయి. వాళ్లంద‌ర్నీ సెలెక్ట్ చేసుకోడానికి క్రిష్ ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.
పోలిక‌ల‌కు ద‌గ్గ‌రగా ఉండే న‌టుల్ని వెతుక్కోడానికి ఈ క్యాస్టింగ్ కాల్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. ద‌స‌రాకు ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది.. సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. మూడు నెల‌ల్లో క్రిష్ ఈ చిత్రాన్ని పూర్తి చేసేలాగే ఉన్నాడు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి లాంటి సినిమాను కూడా ఈయ‌న కేవ‌లం 78 రోజుల్లో పూర్తి చేసాడు. మ‌రి ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎలా చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here