ఎమ్మెల్యే.. ఇచ్చాడుగా ట్విస్ట్..

Nandamuri Kalyan Ram Kajal Aggarwal's MLA in March
క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ తెర‌కెక్కించిన చిత్రం ఎమ్మెల్యే. ఈ చిత్రం మార్చ్ 23న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తైపోయింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ప్ర‌మోష‌న్ కు తెర‌తీసాడు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక క‌ళ్యాణ్ రామ్ కూడా సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు.
తాజాగా కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు. ఈ మ‌ధ్యే షూటింగ్ గాయ‌ప‌డ్డ క‌ళ్యాణ్ రామ్ కు డాక్ట‌ర్లు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. కానీ సినిమా విడుద‌లైన త‌ర్వాతే రెస్ట్ తీసుకోనున్నాడు క‌ళ్యాణ్. నిజానికి మార్చ్ 17నే క‌ర్నూల్ లో భారీ ప్రీ రిలీజ్ వేడుక‌కు ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇది క్యాన్సిల్ అయింది.
దానికి కార‌ణం కూడా క‌ళ్యాణ్ రామ్ గాయ‌మే అని తెలుస్తుంది. ఈ వేడుక‌ను ఇప్పుడు హైద‌రాబాద్ కు షిఫ్ట్ చేసార‌ని తెలుస్తుంది. మార్చ్ 21న అంటే స‌రిగ్గా విడుద‌ల‌కు రెండు రోజుల ముందే భాగ్య‌న‌గ‌రంలోనే ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌బోతుంది. దీనికి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా రానున్నాడు. మొత్తానికి ఉంది ఉంది అని చివ‌రివ‌ర‌కు ఊరించి.. సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చాడు క‌ళ్యాణ్ రామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here