'ఏక్‌' సెన్సార్ పూర్తి… ఏప్రిల్ లో విడుదల


కె వరల్డ్ మూవీస్ బ్యానర్ పై రుద్రారపు సంపత్ డైరెక్షన్ లో బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ హీరోహీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘ఏక్’. బీయింగ్ హ్యూమన్ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ.. ” ఏక్ చిత్రం నేటి జనరేషన్ యూత్ కోసం సరికొత్తగా రూపొందించడం జరిగింది. మానవీయ విలువలతో, మంచి కాన్సెప్ట్ తో దర్శకుడు సంపత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంత్ర ఆనంద్ సంగీతం సారథ్యంలో రూపుదిద్దుకున్న పాటలను ఇటీవల కింగ్ నాగార్జున గారు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఆడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయి. విడుదలకు ముందే చిత్రంపై ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండటం చాలా ఆనందంగా ఉంది. విడుదల తర్వాత కూడా అందరిని ఈ చిత్రం మెప్పిస్తుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు చిత్రంపై మంచి ప్రశంసలు కురిపించారు.
సెన్సార్ సభ్యుల నుండి యు బై ఏ సర్టిఫికెట్ పొందిన మా చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..” అన్నారు. బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ, సుమన్, బెనర్జీ, పృథ్విరాజ్, శ్రవణ్, సర్దార్, అమన్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మంత్రం ఆనంద్, ఆర్ట్: విజయ్ కృష్ణ, కెమెరా: చక్రవర్తి ఘనపాటి, ఎడిటింగ్: నందమూరి హరి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-నిర్మాత: హరికృష్ణ కొక్కొండ, దర్శకత్వం: సంపత్ రుద్రారపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here