ఒకేరోజు బోయ‌పాటి.. రాజమౌళి సినిమాలు..

Jr NTR Ram Charan
అదేంటి.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌మౌళి ఇంకా సినిమానే మొదలు పెట్ట‌లేదు. అక్టోబ‌ర్ లో కానీ ఈయ‌న త‌ర్వాతి సినిమా మొద‌ల‌వ్వ‌దు. ఇలాంటి టైమ్ లో బోయ‌పాటి సినిమాతో ఈయ‌న ఎలా పోటీ ప‌డ‌తాడు అనుకుంటున్నారా..? అవును.. మీరు ఊహించింది నిజ‌మే.. కానీ ఈయ‌న బోయ‌పాటితో పోటీ ప‌డేది కూడా నిజ‌మే. అదెలా అనుకుంటున్నారా..? ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల్లో ఇప్పుడు ఉన్న కామ‌న్ పాయింట్ రామ్ చ‌ర‌ణ్. ఇద్ద‌రూ చ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే బోయ‌పాటి సినిమా మొద‌లైంది కూడా. కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా చ‌ర‌ణ్ సెట్ లో అడుగు పెట్ట‌లేదు. రంగ‌స్థ‌లం విడుద‌ల త‌ర్వాత బోయ‌పాటి సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడు మెగా వార‌సుడు. మ‌రోవైపు ఇప్పుడు రాజ‌మౌళి సినిమా కోసం ఎన్టీఆర్ తో క‌లిసి అమెరికా వెళ్లాడు చ‌ర‌ణ్. అక్క‌డే ప‌ది రోజులు ఉండి ఫోటోషూట్ తో చేసి వ‌స్తాడు. వ‌చ్చిన త‌ర్వాత బోయ‌పాటి సినిమాతో బిజీ కానున్నాడు. అయితే మార్చ్ 27న త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఆ రోజు రెండు శుభ‌వార్త‌లు చెప్ప‌బోతున్నాడు చ‌ర‌ణ్. బోయ‌పాటి శీను చిత్ర ఫ‌స్ట్ లుక్ తో ఆ రోజు బ‌య‌టికి రానుంది. రాజ‌మౌళి సినిమా గురించి అనౌన్స్ మెంట్ కూడా అదే రోజు రానుంద‌ని తెలుస్తుంది. ఈ రెండు మెగా అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా మార‌నున్నాయి. మ‌రోవైపు బ‌ర్త్ డే త‌ర్వాత మూడు రోజులకే రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. దాంతో మెగాభిమానుల‌కు మార్చ్ చివ‌రివారం అంతా పండ‌గే పండ‌గ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here