ఒక్క సినిమా.. ఇద్ద‌రు హాట్ బ్యూటీస్..


ఇప్ప‌టికే బాలీవుడ్ లో ఎంతోమంది ముద్దుగుమ్మ‌లు ఉన్నారు. అదో మ‌హాస‌ముద్రం. రోజుకో కొత్త భామ వ‌చ్చి అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటారు. కానీ చాలా మందికి స‌రైన ఎంట్రీ ఉండ‌దు ఇండ‌స్ట్రీలో. పెద్ద సినిమాల్లో ఆఫ‌ర్లు లేక ఎక్స్ పోజింగ్ కు అల‌వాటు పడి చిన్న సినిమాల‌తో కెరీర్ ముగిస్తుంటారు.
కానీ స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తే మాత్రం రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతుంటారు. ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో ఇద్ద‌రు కొత్త ముద్దుగుమ్మ‌లు వ‌స్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ ప‌రిచ‌యం చేస్తున్నాడు కాబ‌ట్టి వాళ్ల‌పై అంద‌రి దృష్టి ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2లో అన‌న్యా పాండేతో పాటు తారా స‌తారియాను హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తున్నాడు క‌ర‌ణ్. పునీత్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం నాలుగేళ్ల కింద క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ కు సీక్వెల్.
అందులో వ‌రుణ్ ధావ‌న్, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, అలియాభ‌ట్ ను ప‌రిచ‌యం చేసాడు క‌ర‌ణ్. ఇక ఇప్పుడు సీక్వెల్ లో ఇద్ద‌రు హీరోయిన్ల‌ను తీసుకొస్తున్నాడు ఇండ‌స్ట్రీకి. హీరోగా మాత్రం టైగ‌ర్ ష్రాఫ్ న‌టిస్తున్నాడు. ఈయ‌న ఈ మ‌ధ్యే భాగీ 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ చిత్రం 150 కోట్లకు పైగా వ‌సూలు చేసింది. మ‌రి ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్ బాలీవుడ్ ను ఎలా వాడుకుంటారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here