ఒక ఫ్రేమ్.. ముగ్గురు పెళ్లాలు..

MAHANATI ACTRESS

ఒకచోట రెండు కొప్పులు ఉండ‌వు అంటారు. కానీ జెమినీ గ‌ణేష‌న్ మాత్రం తోపు ఈ విషయంలో. ఒకే చోట రెండు కాదు ఏకంగా మూడు నాలుగు కొప్పులు కూడా ఉండేలా చేసాడు. మ‌హాన‌టి సావిత్రి జీవితంలో విల‌న్ గా మారిన జెమిని.. త‌న లైఫ్ లో మాత్రం చాలా సుఖ‌పురుషుడు. మ‌న‌సుకు న‌చ్చితే ప్రేమించు అనే టైప్ ఈ హీరోది. అలాగే సావిత్రి కంటే ముందు అలిమేలు.. పుష్ప‌వ‌ల్లి ఉన్నారు.

తాజాగా మ‌హాన‌టి మేకింగ్ స్టిల్స్ విడుద‌ల అయ్యాయి. అందులో ఒక్కో ఫ్రేమ్ లోనే ముగ్గురు భార్య‌ల‌తో జెమిని ఇచ్చిన పోజ్ అద్భుత‌మే. ఇక్క‌డ జెమినీ అంటే దుల్క‌ర్ స‌ల్మాన్. కీర్తిసురేష్.. మాళ‌విక న‌య్య‌ర్.. బిందు చంద్ర‌మౌళి.. ఇలా ముగ్గురు భార్య‌ల‌తో ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలు విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇవి ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఒకే చోట ఇంత‌మంది భార్య‌ల‌ను ఉంచి మెయింటేన్ చేసిన జెమినికి అంతా స‌లాం కొడుతున్నారిప్పుడు. ఆయ‌న్ని అందుకే కాద‌ల్ మ‌న్న‌న్ అన్నారు.

ఇన్ని సినిమాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ మ‌హాన‌టి మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. వీకెండ్స్ లో ఫుల్స్ అవుతున్నాయి. షేర్ ఇప్ప‌టికే 40 కోట్ల‌కు పైగా వ‌చ్చింది. ఫుల్ ర‌న్ లో మ‌రో 2 కోట్ల వ‌ర‌కు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. కాలా వ‌చ్చినా కూడా ఈ వారం కూడా మ‌హాన‌టి త‌న ఉనికి చాటుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here