ఓ ప‌క్క‌న అఖిల్.. మ‌రోప‌క్క ఎన్టీఆర్..


టైమ్ అంటే ఇలాగే ట‌ర్న్ అవ్వాలి మ‌రి. మొన్న‌టి వ‌ర‌కు రొటీన్ మ్యూజిక్ ఇస్తాడ‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న థ‌మ‌న్ ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ ర‌ప్ఫాడిస్తున్నాడు. అస‌లు ఖాళీ అనేది లేకుండా కుమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న ఎన్టీఆర్ సినిమాతో పాటు అఖిల్ కు కూడా ప‌ని చేస్తు న్నాడు.
ఇద్ద‌రితోనూ గ‌తంలో ప‌ని చేసిన అనుభ‌వం ఉంది ఈ సంగీత ద‌ర్శ‌కుడికి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ ట్రిపుల్ టికి రికార్డింగ్ మొద‌లు పెట్టాడు థ‌మ‌న్. ట్రిపుల్ టి అంటూ తార‌క్-త్రివిక్ర‌మ్-థ‌మ‌న్ అని. ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ మొద‌లైంద‌ని ఫోటో చూపించి మ‌రీ చెప్పాడు థ‌మ‌న్.
ఇక మ‌రోవైపు అఖిల్ సినిమా ప‌నులు కూడా మొద‌లుపెట్టాడు. వెంకీ అట్లూరితో అఖిల్ మూడో సినిమా చేస్తున్నాడు. దీనికి మ‌రోసారి థ‌మ‌న్ నే తీసుకున్నాడు వెంకీ. తొలిప్రేమ‌కు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చిన థ‌మ‌న్.. ఇప్పుడు అఖిల్ సినిమాకు ఇదే చేయాల‌ని చూస్తున్నాడు. మొత్తానికి మ‌నోడు రెండు సినిమాల‌తో సూప‌ర్ బిజీ అయిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here