కాజ‌ల్ ఇక భ‌ల్లే భ‌ల్లే..!

 

KAJAL IN PUNJABI

భ‌ల్లే భ‌ల్లే ఏంటి.. కొంప‌దీసి కాజ‌ల్ పెళ్లి కానీ చేసుకుంటుందా అనుకుంటున్నారా ఏంటి..? ఇప్ప‌ట్లో ఈ భామ పెళ్లి వైపు వెళ్ల‌దులే.. చెల్లి త‌ల్లి అయినా కూడా ఇప్ప‌టికీ ఈమె మాత్రం నో పెళ్లి అంటుంది. అవ‌కాశాలు బాగానే వ‌స్తుండ‌టంతో కాజ‌ల్ అడుగులు ఇంకా ఇండ‌స్ట్రీలోనే ఉన్నాయి.

ఇప్ప‌టికే చాలా ఇండ‌స్ట్రీలు క‌వ‌ర్ చేసిన ఈ భామ‌.. ఇప్పుడు మ‌రో ఇండ‌స్ట్రీలో అడుగు పెడుతుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది.. త‌మిళ్లో గుర్తింపు తెచ్చుకుంది.. హిందీలోనూ అప్పుడ‌ప్పుడూ కొన్ని సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈమె పంజాబి ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెడుతుంది. అక్క‌డ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది చంద‌మామ‌. కానీ సినిమా వివ‌రాలు మాత్రం చెప్ప‌లేదు ఈ భామ‌.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కాజ‌ల్ న‌టించిన సినిమాలు.. ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే పంజాబి ఇండ‌స్ట్రీ చాలా చిన్న‌ది. అక్క‌డ కోట్ల‌కు కోట్ల పారితోషికాలు రావు. సింపుల్ గా ల‌క్షల్లో తీసుకుని స‌ర్దుకుపోవాల్సిందే. ఇది తెలిసి కూడా పంజాబి వైపు అడుగేస్తుంది కాజ‌ల్. మ‌రి ఈమెలో ఇంత స‌డ‌న్ గా ఇంత మార్పు ఎందుకొచ్చిందో ఆమెకే తెలియాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here