కాజ‌ల్ ను లైన్ లో పెట్టిన బెల్లంకొండ‌.. 

Kajal
కామ‌ధేనువు.. అడిగింది ఇచ్చేదాన్ని ఇలా పిలుస్తుంటాం. ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను కూడా హీరోయిన్లు ఇలాగే పిల‌వాలేమో మ‌రి..? అలా మారిపోతున్నాడు ఈ కుర్ర హీరో. ప్ర‌తీ సినిమాలోనూ స్టార్ హీరోయిన్ల‌తోనే జోడీ క‌డుతున్నాడు బెల్లంకొండ‌. క‌నీసం చిన్న హీరోయిన్ల వైపు చూడ‌టం కూడా లేదు. ఓ కోటి రూపాయ‌లు ఎక్కువైనా ప‌ర్లేదు కానీ స్టార్స్ నే తీసుకురండి అంటున్నాడు ఈ హీరో. అస‌లు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టికీ మిగిలిపోయే సంచ‌ల‌నం బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ ఎంట్రీ. 40 కోట్ల బ‌డ్జెట్.. తొలి సినిమాలోనే స‌మంత‌, త‌మ‌న్నా లాంటి స్టార్ హీరోయిన్ల‌తో రొమాన్స్.. వివి వినాయ‌క్ లాంటి అగ్ర ద‌ర్శ‌కుడు.. ఫుల్ సెట‌ప్.. అంతా సాలిడ్ లాంచింగ్. కానీ ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణంగా అల్లుడు శీను నిరాశ‌ప‌రిచింది. అయితే ఆ సినిమాలో న‌టించిన వాళ్ల‌కు మాత్రం అల్లుడుశీనుతో లాభ‌మే జ‌రిగింది.
స‌మంత‌నే తీసుకోండి.. అప్ప‌టి వ‌ర‌కు కోటికి త‌క్కువ తీసుకునేది కాదు ఈ భామ‌. కానీ అల్లుడు శీనులో కొత్త హీరోతో న‌టించాల‌న‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా అప్ప‌ట్లోనే రెండు కోట్ల‌కు పైగా తీసుకుంది స‌మంత‌. ఇక త‌మ‌న్నా కూడా ఒక్క ఐటం సాంగ్ కు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేసింది. ఇదంతా ముద్దుగుమ్మ‌ల‌కు బెల్లంకొండ వార‌సుడు ఇచ్చిన వ‌ర‌మే. ఆ త‌ర్వాత కూడా జ‌య జాన‌కి నాయ‌కాలో ర‌కుల్ ప్రీత్ తో జోడీ క‌ట్టాడు బెల్లం కొండ శ్రీ‌నివాస్. ఈ చిత్రం కోసం ఏకంగా కోటిన్న‌ర చ‌దివించాడు ఈ కుర్ర హీరో. ఇక ఇప్పుడు పూజాహెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు. శ్రీ‌వాస్ సినిమా కోసం ఈయ‌న పూజాతో న‌టిస్తున్నాడు. ఇందులో న‌టించ‌డానికి పూజాకు కోటికి పైగా ఇచ్చారు.
ఇక ఇప్పుడు మ‌రో టాప్ హీరోయిన్ ను లైన్ లో పెడుతున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఆమె కాజ‌ల్. అవును.. కొత్త ద‌ర్శ‌కుడు నానితో బెల్లంకొండ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర స్క్రిప్ట్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజ‌ల్ ను అనుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆమెకు క‌థ చెప్పడం.. ఆమె ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయ‌ని తెలుస్తుంది. దీనికోసం ఆమెకు ఏకంగా 2 కోట్ల పారితోషికం ఇస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే కన‌క హీరోయిన్ల‌కు వ‌రాలివ్వ‌డానికి వ‌చ్చిన కామ‌ధేనువు అయిపోతాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. మొత్తానికి చూడాలిక‌.. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా తొలి విజ‌యం కోసం చూస్తోన్న ఈ హీరో.. ఎవ‌రి అడుగుతో హిట్ అందుకుంటాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here