కార్వాన్.. అదిరింది ఇర్ఫాన్..!

ఇర్ఫాన్ ఖాన్.. కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మొద‌లై.. విల‌న్ గా చేసి.. హీరో అయి.. మ‌ళ్లీ ఇప్పుడు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న ఆరోగ్యం కోసం పోరాడుతున్నాడు. ఎక్క‌డో విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆయ‌న హాస్పిట‌ల్లో ఉన్నా కూడా ఇక్క‌డ మాత్రం ఆయ‌న న‌టించిన సినిమాలు ఒక్కొక్క‌టిగా విడుద‌ల‌వుతూ వ‌స్తున్నాయి. ఇప్పుడు కార్వాన్ ట్రైల‌ర్ విడుద‌లైంది.

దుల్క‌ర్ స‌ల్మాన్ తో క‌లిసి ఇర్ఫాన్ ఖాన్ న‌టిస్తున్న సినిమా ఇది. ఆక‌ర్ష్ ఖురానా ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర ట్రైల‌ర్ లో దుల్క‌ర్ ను పూర్తిగా డామినేట్ చేసాడు ఇర్ఫాన్ ఖాన్. ఈయ‌న హీరో కాక‌పోయినా హీరో ఇత‌డే అనేంత స్థాయిలో ద‌ర్శ‌కుడు కూడా ఇర్ఫాన్ పైనే ఫోక‌స్ చేసాడు. ముఖ్యంగా ఈయ‌న కామెడీ టైమింగ్ అదిరిపోయింది.

ఇదే ఇప్పుడు సినిమాపై అంచ‌నాలు కూడా పెంచేసింది. ఆగ‌స్ట్ 3న విడుద‌ల కానుంది ఈ చిత్రం. కేవ‌లం ఇర్ఫాన్ ఖాన్ కోస‌మే కార్వాన్ త‌ప్ప‌కుండా చూసేలా ఉన్నారు ప్రేక్ష‌కులు. అంత‌గా త‌న కామెడీతో క‌డుపులు చెక్క‌లు చేసాడు ఈ న‌టుడు. మ‌రి ట్రైల‌ర్ లోనే ఇంత‌గా ఉంటే.. రేపు సినిమాలో ఇర్ఫాన్ అరాచ‌కాలు ఇంకెలా ఉంటాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here