కాలా టీజ‌ర్.. విజ‌య్, ర‌జినీ ఫ్యాన్స్ వైరం.. 

Rajini Kaala
అభిమానులందు త‌మిళ అబిమానులు వేర‌యా అని ఊరికే అన‌లేదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. త‌మ అభిమానం కాదు కాదు.. పిచ్చిని మ‌రోసారి నిరూపించుకున్నారు త‌మిళ అభిమానులు. దుంప‌కు లేని దూ.. క‌త్తికి ఎందుకు అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. కొంద‌రు అభిమానుల్ని చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఎక్క‌డ చూసుకున్నా హీరోలు ఒక‌రంటే ఒకరికి మంచి స్నేహ‌మే ఉంది. ముఖ్యంగా సీనియ‌ర్ హీరోలంతా బాగానే క‌లివిడిగా ఉంటారు. త‌మిళ ఇండ‌స్ట్రీ లోనూ హీరోలంతా ఒక్క‌టే అని చెబుతుంటారు. అజిత్-విజ‌య్.. విజ‌య్-ర‌జినీ.. ఇలా అంతా క‌లిసి మెలిసి క‌నిపిస్తుంటారు. కానీ వాళ్ల ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పంటూ క‌త్తులు నూరుతుంటారు. ఇండ‌స్ట్రీలోని హీరోలంతా త‌మ‌కు స్నేహితులే అని ప్ర‌తీ హీరో చెబుతూనే ఉంటాడు.
ఇకిప్ప‌డు సోష‌ల్ మీడియాలో విజ‌య్, ర‌జినీ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ ఇలాగే జ‌రుగుతుంది. ఈ మ‌ధ్యే ఓ గుళ్లో ఫ్లెక్సీల ద‌గ్గ‌ర జ‌రిగిన  వార్ లో విజ‌య్ ఫ్యాన్స్ ర‌జినీ ఫ్యాన్స్ ను క‌త్తుల‌తో పొడిచేసారు. ఇక ఇప్పుడు కాలా టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత విజ‌య్ ఫ్యాన్స్ వీరంగం మరీ ఎక్కువ అయిపోయింది. ఈ చిత్ర టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ఎలాంటి రికార్డులు సృష్టించ‌లేదు. చెప్ప‌కుండా స‌డ‌న్ గా అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు టీజ‌ర్ విడుద‌ల చేసాడు నిర్మాత ధ‌నుష్. దాంతో ఈ టీజ‌ర్ వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి ఉద‌యం వ‌ర‌కు తెలియ‌దు. దాంతో రికార్డుల వేట‌లో బాగా వెన‌క‌బ‌డిపోయాడు ర‌జినీకాంత్. ఇప్పుడు కాలా టీజ‌ర్ ఇలా వెన‌క‌బ‌డ‌టంతో విజ‌య్ ఫ్యాన్స్ తమ హీరోనే ఇక‌పై నెంబ‌ర్ వ‌న్ అంటూ ర‌చ్చ చేస్తున్నారు.
గ‌తేడాది విడుద‌లైన మెర్సల్ రికార్డులు సృష్టించింది. ఇక ఈ చిత్ర టీజర్ విడుదలైన 10 నిమిషాల్లోనే యూ ట్యూబ్‌లో లక్ష లైకులు సొంతం చేసుకుంది. తొలి గంటలో రికార్డు స్థాయిలో 4 లక్షల లైక్స్ సాధించింది. తొలి 5 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్.. 6 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది మెర్స‌ల్ టీజ‌ర్. కానీ ఇప్పుడు విడుద‌లైన కాలా టీజర్ మాత్రం 11 గంటల్లో కేవలం 2.7 మిలియన్ వ్యూస్.. 2.3 లక్షల వ్యూస్ దక్కించుకుని రేస్ లో వెనక‌బ‌డింది. ఒక రోజు ముందే కాలా టీజ‌ర్ లీక్ అవ్వ‌డం వ్యూవ్స్ పై ఎఫెక్ట్ చూపించింది. దానికితోడు చెప్పా పెట్ట‌కుండా విడుద‌ల చేయ‌డంతో చాలా మందికి టీజ‌ర్ వ‌చ్చినట్లు కూడా తెలియ‌దు. అది కూడా ఎఫెక్ట్ బాగా చూపించింది. మొత్తానికి చూడాలిక‌.. మ‌రి రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాతైనా మెర్సల్ రికార్డుల్ని కొట్టి తానే ఇంకా నెంబ‌ర్ వ‌న్ అని ర‌జినీకాంత్ నిరూపించుకుంటాడో లేదో..? అస‌లు నిరూపించుకోవ‌డం ఏంటి.. అభిమానుల ఓవ‌ర్ కాక‌పోతే ర‌జినీ త‌ర్వాతే త‌మిళ‌నాట ఎవరైనా..! అది ఒప్పుకోవాల్సిన నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here