కావేరీ జ‌లాల్లో కాలా మున‌క‌..!

kala
ర‌జినీకాంత్ సినిమా అంటే త‌మిళ ఇండ‌స్ట్రీ ఒక్క‌టే కాదు.. తెలుగు, క‌న్న‌డ‌, హిందీల్లోనూ పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుంది. దానికి కార‌ణం ఈయ‌న ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ కాబ‌ట్టి. ఇప్పుడు జూన్ 7న కాలా విడుద‌ల కానుంది. రంజిత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అనుకున్న టైమ్ కంటే కాస్త ఆల‌స్యంగానే వ‌స్తున్నా కూడా విడుద‌ల టైమ్ వ‌ర‌కు అంతా స‌ర్దుకుంటుంద‌ని న‌మ్ముతున్నారు కాలా టీం.
అనుకున్న‌ట్లుగానే కాలాపై ఇప్పుడు అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాట‌క‌లో ఇప్పుడు కాలాకు తిప్ప‌లు త‌ప్పేలా లేవు. ఈ సినిమా అక్క‌డ విడుద‌ల కావ‌డం అనుమానంగా మారింది. దానికి కార‌ణం కావేరీ జ‌లాలు. ఈ మ‌ధ్యే త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ మీటింగ్ లో కావేరీ జ‌లాల ఇష్యూలో క‌ర్ణాట‌క‌కు వ్య‌తిరేకంగా కొన్ని క‌మెంట్స్ చేసాడు ర‌జినీకాంత్. దాంతో ఇప్పుడు ర‌జినీపై కోపంగా ఉన్నారు క‌న్న‌డిగులు.
ఇక్క‌డే ఉద్యోగం చేసి.. క‌ర్ణాట‌క‌లోనే చాలా ఏళ్లున్న ర‌జినీ.. అదే రాష్ట్రం గురించి వ్య‌తిరేకంగా మాట్లాడతాడా అంటూ ఊగిపోతున్నారు. ఈ కోపం ఇప్పుడు కాలాపై క‌నిపిస్తుంది. ర‌జినీ వ‌చ్చి క్ష‌మాప‌ణ చెబితే కానీ కాలాను ఇక్క‌డ విడుద‌ల కానివ్వం అంటూ రాజ‌కీయ సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. చూస్తుంటే ఈ ఇష్యూ ఇప్ప‌ట్లో తెగేలా కూడా క‌నిపించ‌డం లేదు. సాక్షాత్తు ర‌జినీ రంగంలోకి దిగితే కానీ కాలాకు క‌ర్ణాట‌క‌లో మంచి రోజులు వ‌చ్చేలా లేవు. గ‌తంలో బాహుబ‌లి టైమ్ లో స‌త్య‌రాజ్ క్ష‌మాప‌ణ చెప్పేవ‌ర‌కు స‌తాయిస్తూనే ఉన్నారు క‌న్న‌డిగులు. మ‌రిప్పుడు ర‌జినీ విష‌యంలో ఏం చేస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here