కిషోర్.. వెంకీ.. గోపీ.. ఇంకా ఎంత‌మంది..?


ఏంటీ లిస్ట్ అనుకుంటున్నారా..? ఒక్క హీరో కోసం వేచి చూస్తున్న ద‌ర్శ‌కుల సంఖ్య ఇది. ఇంత‌మంది వెయిట్ చేస్తున్నారంటే ఆ హీరో ఎవ‌రో తోపు అయ్యుంటాడేమో అనుకుంటున్నారా..? అది కూడా కాదు.. ఆ హీరోకు వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు ఉన్నాయి. అత‌డే సాయిధ‌రంతేజ్.
మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఈ హీరోకు బాగానే క‌లిసొచ్చింది. వ‌ర‌స‌గా కెరీర్ మొద‌ట్లో విజ‌యాలు అందుకున్న సాయి.. ఆ త‌ర్వాత రేస్ లో క‌నిపించ‌లేదు. 2015లో వ‌చ్చిన సుప్రీమ్ త‌ర్వాత ఈయ‌న‌కు హిట్ లేదు కానీ క్రేజ్ మాత్రం ఇంకా త‌గ్గ‌లేదు. జ‌వాన్.. తిక్క‌.. న‌క్ష‌త్రం.. విన్న‌ర్.. ఇంటిలిజెంట్ ఇలా వెళ్తుంది ఇప్పుడు సాయిధ‌రంతేజ్ ఫ్లాపుల ప్ర‌స్థానం. ప్ర‌స్తుతం తేజ్ ఐ ల‌వ్ యూతో బిజీగా ఉన్నాడు సాయి.
ఈ చిత్రం త‌ర్వాత గోపీచంద్ మ‌లినేనితో ఓ చిత్రం చేయ‌బోతున్నాడు సాయి. ఇది మెడిక‌ల్ మాఫియా చుట్టూ తిరుగే క‌థ‌. ఇక దాంతోపాటే కిషోర్ తిరుమ‌ల‌తో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు. ఇక ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల కూడా సాయి కోస‌మే ఓ క‌థ రాసుకున్నాడు. ఈ సినిమాను గీతాఆర్ట్స్ నిర్మించ‌బోతుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి ఇన్ని ఫ్లాపులు ఉన్నా కూడా సాయి కోసం ఇంత‌మంది ద‌ర్శ‌కులు వేచి చూడటం నిజంగా గొప్ప విష‌య‌మే..! మ‌రి చూడాలిక‌.. ఈ సినిమాల్లో ఏది సాయి కోరుకున్న విజ‌యం తీసుకొస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here