కీర్తిసురేష్.. ఈ పేరు గుర్తు పెట్టుకోండి..!


మ‌హాన‌టిలో ఉంటుంది క‌దా.. సావిత్రి ఇది బాగా వినిపించే పేరు అవుతుంది అని..! ఇప్పుడు కీర్తిసురేష్ ను కూడా ఇదే అంటున్నారు. మ‌హాన‌టికి ముందు ఈ భామ కెరీర్ ఎలా ఉందో అన‌వ‌స‌రం.. కానీ ఇప్ప‌ట్నుంచీ మాత్రం కీర్తి కెరీర్ అక్క‌డ ఉండ‌టం ఖాయం. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతో కీర్తికి కీర్తి ప్ర‌తిష్ట‌లు బాగా పెరిగిపోయాయి. సావిత్రిగా ఆమె చేసిన అభిన‌యం చూసి అంతా ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు.
వ‌ర‌స‌గా కీర్తికి అవ‌కాశాల జ‌ల్లు కురుస్తుంది. ప్ర‌స్తుతం తెలుగులో ఏ సినిమా ఒప్పుకోక‌పోయినా కూడా రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ లో ఎన్టీఆర్ కు జోడీగా కీర్తినే తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం గట్టిగానే జ‌రుగుతుంది. మ‌హాన‌టిలో ఈమె ప‌ర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన ద‌ర్శ‌క‌ధీరుడు.. త‌న క‌థ‌కు కీర్తి అయితే ప‌క్కాగా సూట్ అవుతుంద‌ని ఫిక్స్ అయిపోయాడు.
ఇక ఈయ‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోలు కూడా కీర్తితో జోడీ క‌ట్ట‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ప్ర‌స్తుతం త‌మిళ్ లో విక్ర‌మ్ తో సామి 2.. విశాల్ తో పందెంకోడి 2 సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది కీర్తిసురేష్. ఇవ‌న్నీ పూర్త‌య్యేస‌రికి సౌత్ లో నెంబ‌ర్ వ‌న్ పీఠం ఈ అభిన‌వ సావిత్రి ముందు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here