కీర్తిసురేష్ దానికి ఒప్పుకోలేద‌ట‌..


ఓ సినిమా ఒప్పుకున్న త‌ర్వాత దానికి ఏం కావాలో అది చేయ‌డం న‌టుడిగా వాళ్ల బాధ్య‌త‌. ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లుగా మారిపోవాల్సిందే ఆప్ష‌న్ కూడా ఉండ‌దు. అనుష్క‌నే తీసుకోండి.. సైజ్ జీరో కోసం ఈమె మారిన తీరు ఇప్ప‌టికీ ఇబ్బంది పెడుతూనే ఉంది. కానీ క‌థ‌పై ఉన్న క‌మిట్మెంట్ తో అప్ప‌ట్లో ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు విన్న‌ది అనుష్క‌.
అందుకే ఆమె అంటే ఇప్ప‌టికీ ద‌ర్శ‌కులంద‌రికీ అంత‌గా ఇష్టం. ఇప్పుడు మ‌హాన‌టి విష‌యంలో కీర్తిసురేష్ కి కూడా ఇదే జ‌రిగింది. సావిత్రి పాత్ర అంటేనే కాస్త బొద్దుత‌నం ఉంటుంది. కెరీర్ లో ఎప్పుడూ ఆమె స‌న్న‌గా లేదు. అందుకే ఈ పాత్ర కోసం కీర్తిసురేష్ ని తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఒప్పుకున్న‌పుడే పూర్తిగా సావిత్రిలా మారిపోయింది కీర్తి. షూటింగ్ అంతా బాగానే జ‌రిగింది కానీ ఒక్క విష‌యంలో మాత్రం ద‌ర్శ‌కుడితో కీర్తికి విభేదాలు వ‌చ్చాయ‌ని తెలుస్తుంది.
అదే పెళ్లైన త‌ర్వాత సావిత్రి జీవితం.. అవును.. పెళ్లైన త‌ర్వాత సావిత్రి కాస్త లావు అయింది. ఆ పాత్ర‌ను స‌రిగ్గా తెర‌పై చూపించాలంటే కీర్తిని కూడా బ‌రువు పెర‌గాల‌ని సూచించాడు ద‌ర్శ‌కుడు. కానీ త‌న కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతున్న స‌మ‌యంలో బ‌రువు పెరిగి అన‌వ‌స‌రంగా రిస్క్ తీసుకోలేన‌ని తెగేసి చెప్పిన‌ట్లు తెలుస్తుంది. దాంతో త‌న క‌ష్టాలేవో నాగ్ అశ్విన్ తాను ప‌డ్డాడ‌ని తెలుస్తుంది. ఈ ఒక్క విష‌యంలో మాత్రం కీర్తి మ‌హాన‌టికి స‌హ‌క‌రించ‌లేద‌ని.. మిగిలిన అన్ని విష‌యాల్లో ఆమె స‌పోర్ట్ అద్భుతం అని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. తెర‌పై సావిత్రి జీవితాన్ని కీర్తి ఎలా అవ‌పోస‌న ప‌ట్టిందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here