కీర్త‌న‌లు వ‌ద్దంటున్న త్రివిక్ర‌మ్..


త్రివిక్ర‌మ్ సినిమా అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది డైలాగులు.. ఆ త‌ర్వాత సినిమాలో కీర్త‌న‌లే. అదేంటో కానీ ప్ర‌తీ సినిమాలోనూ ఒక్క కీర్త‌న అయినా లేక‌పోతే ఈయ‌న సినిమా తీసిన‌ట్లు కూడా ఉండ‌దేమో..? అందుకే ప్ర‌తీసారి అది సెంటిమెంట్ గా మార్చేసుకున్నాడు మాట‌ల మాంత్రికుడు. అత్తారింటిటికి దారేది నుంచే ఇది మొద‌లైంది. అందులో దేవ‌దేవం అంటూ ఎమ్మెస్ సుబ్బ‌ల‌క్ష్మి పాడిన పాట‌ను వాడుకున్నాడు.
ఇక అ..ఆ..లో కూడా కృష్ణుడిపై గోపాలా గోపాలా అంటూ ఓ కీర్త‌న పెట్టుకున్నాడు. మొన్న విడుద‌లైన అజ్ఞాత‌వాసిలో కూడా రారా కృష్ణ అంటూ చ‌క్క‌టి కీర్త‌న పెట్టాడు త్రివిక్ర‌మ్. అజ్ఞాత‌వాసిలో ఈ పాట హిట్ అయింది కానీ సినిమా మాత్రం కాదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తోన్న అర‌వింద స‌మేత‌లో కూడా ఇలాంటి కీర్త‌న ఉంటుందేమో అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటిదేం లేదంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సారి ఎన్టీఆర్ కు కీర్త‌న‌లు లేవంటున్నాడు మాట‌ల మాంత్రికుడు. దాని ప్లేస్ లో ఐటం సాంగ్ ఉందంటున్నాడు.
అవును.. అర‌వింద స‌మేత‌లో కాజ‌ల్ తో చిందేయ‌బోతున్నాడు జూనియ‌ర్. త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఐటం సాంగ్స్ అస్స‌లు క‌న‌బ‌డ‌వు. ఒక్క అత్తారింటికి దారేదిలో మాత్ర‌మే స్పెష‌ల్ సాంగ్ పెట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మ‌ళ్లీ ఐటం సాంగ్ చిత్రీక‌రిస్తున్నాడు త్రివిక్ర‌మ్. జ‌న‌తా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో ప‌క్కా లోక‌ల్ అంటూ చిందేసిన కాజ‌లే ఇప్పుడు మ‌రోసారి కాలు క‌ద‌ప‌నుంది. మొత్తానికి కీర్త‌న‌లు లేక‌పోయినా.. మాస్ కీర్త‌న ఉంద‌న్న‌మాట‌. అదేనండీ ఐటం సాంగ్. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here