కుర్రాడి ఫ్ర‌స్టేష‌న్ మొద‌ల‌వుతుంది..

ద‌ర్శ‌కుల‌కు ఫ్ర‌స్టేష‌న్ ఉండ‌కూడ‌దు కానీ త‌న‌కు ఉంటుంది అంటున్నాడు అనిల్ రావిపూడి. ఫ్ర‌స్టేష‌న్ తో పాటు ఫ‌న్ కూడా ఉందంటున్నాడు. ఇదే ఇప్పుడు త‌న టైటిల్ గా పెట్టుకుని వ‌చ్చేస్తున్నాడు ఈ హ్యాట్రిక్ ద‌ర్శ‌కుడు. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అంటూ ఎఫ్2తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
ఇందులో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. అస‌లే ఇప్పుడు తెలుగులో మ‌ల్టీస్టారర్స్ ట్రెండ్ పెరిగిపోయింది. దీన్ని ఇంకా ఎంక‌రేజ్ చేస్తూ ఈ క‌థ రాసుకున్నాడు అనిల్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇందులో వ‌రుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ న‌టిస్తుంది. హీరోయిన్ల‌ను రిపీట్ చేయ‌డం అనిల్ కు ఉన్న అల‌వాటు. ప‌టాస్ హీరోయిన్ శృతిసోథితో సుప్రీమ్ లో ఐటం సాంగ్ చేయించాడు..
ఇక సుప్రీమ్ హీరోయిన్ రాశీఖ‌న్నాతో రాజా ది గ్రేట్ లో చిన్న స్టెప్ వేయించాడు. ఇప్పుడు రాజా ది గ్రేట్ హీరోయిన్ మెహ్రీన్ కు మ‌రో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక వెంక‌టేశ్ కు జోడీగా త‌మ‌న్నాను తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రైనా మ‌రీ రొటీన్ అయిపోతుంద‌ని భావించిన అనిల్ రావిపూడి.. కొత్త‌గా ఉంటుంద‌ని త‌మ‌న్నాను సెట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇప్పుడు త‌మ‌న్నాకు పెద్ద‌గా ఆఫ‌ర్లు కూడా లేవు.
ఇలాంటి టైమ్ లో వెంక‌టేశ్ తో అవ‌కాశం అంటే చిన్న‌దేం కాదు. పైగా ఇప్పుడు త‌మ‌న్నా కూడా సీనియ‌ర్ హీరోయినే క‌దా..? ఈ చిత్ర షూటింగ్ మే నుంచి మొద‌లు కానుంది. ద‌స‌రాకు విడుద‌ల చేసే ప్లాన్స్ లో ఉన్నారు. మ‌రి చూడాలిక‌.. ఈ ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here