కుర్రాడు మామూలుగా కుమ్మ‌ట్లేదుగా..!

Tentative title for Vijay Deverakonda’s next

కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు.. సామెత కాస్త ఓల్డ్ అయినా ఇదే గోల్డ్. ఒక‌ప్పుడు చిరంజీవి.. ఆ త‌ర్వాత ర‌వితేజ‌.. ఇప్పుడు నాని.. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వీళ్ల‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇండ‌స్ట్రీలో ఏ అండ లేకుండా స్టార్ అవ్వ‌డం అంటే దాదాపు అసాధ్యం. ఇప్పుడు అసాధ్యం సుసాధ్యం చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చాలా సైలెంట్ గా వ‌చ్చిన ఈ కుర్రాడు.. టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయాడు. పెళ్లిచూపులు లాంటి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అర్జున్ రెడ్డితో అరాచ‌కాలే చేసాడు. ఈ సినిమా 26 కోట్లకు షేర్ వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం ఈ కుర్ర హీరో వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.
మ‌హాన‌టిలో ఈయ‌న కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది మార్చ్ 29న విడుద‌ల కానుంది. విజ‌య్ కెరీర్ ను మార్చేసిన ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్వినే ఇప్పుడు మ‌హాన‌టిని తెర‌కెక్కిస్తున్నాడు. విజయ్ డేట్స్ కోసం ఇండ‌స్ట్రీలో చాలా మంది అగ్ర నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే గీతాఆర్ట్స్ లో వ‌ర‌స‌గా రెండు సినిమాలు చేస్తున్నాడు విజ‌య్. అల్లు అర‌వింద్ నిర్మాణంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తోన్న‌ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ చిత్రానికి ట్యాక్సీ వాలా అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ బ్యాన‌ర్ లోనే మ‌రో సినిమా పూర్తి చేసాడు విజ‌య్. ఇక దీంతోపాటు త్రివిక్ర‌మ్ నిర్మాణంలో నందినిరెడ్డి ద‌ర్శ‌కురాలిగా మ‌రో సినిమా చేస్తున్నాడు. వాటికి తోడు భ‌ర‌త్ క‌మ్మ‌.. రాహుల్ సంక్రీత్య‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుల‌తోనూ సినిమాల‌కు క‌మిట‌య్యాడు విజ‌య్.
ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ తెలంగాణ ల‌వ్ స్టోరీ చేయ‌బోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎలాగూ శేఖ‌ర్ క‌మ్ముల‌తో విజ‌య్ కు మంచి స్నేహం ఉంది. అస‌లు విజ‌య్ ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిందే క‌మ్ముల‌. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు ఫుల్ లెంత్ సినిమా చేయ‌బోతున్నాడు. ఫిదా త‌ర్వాత మ‌రోసారి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా చేయ‌బోతున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నాడు. ఇక జై ల‌వ‌కుశ త‌ర్వాత ఖాళీగా ఉన్న బాబీ.. త్వ‌ర‌లో విజ‌య్ తోనే సినిమా చేయ‌బోతున్నాడు. మొత్తానికి చూడాలిక‌.. విజ‌య్ ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here