కొడుకు ప్లేస్ పై క‌న్నేసిన చిరంజీవి..


అదేంటి.. కొడుకు ప్లేస్ పై చిరంజీవి క‌న్నేయ‌డం ఏంటి..? అస‌లు ఆయ‌న ప్లేస్ అయితే చిరంజీవికి కూడా సొంత‌మేగా అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. చిరంజీవి నిజంగానే చ‌ర‌ణ్ ప్లేస్ పై క‌న్నేసాడు. ఏడాదిపాటు చ‌ర‌ణ్ ఉన్న స్థానాన్ని ఇప్పుడు చిరంజీవి తీసుకోబోతున్నాడు.
ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే రంగ‌స్థ‌లంలోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాడు మెగాస్టార్. అంటే అక్క‌డ షూటింగ్ చేసుకోబోతున్నాడ‌న్న‌మాట‌. రంస‌గ్థ‌లం సినిమా కోసం ప్ర‌త్యేకంగా 5 కోట్ల‌తో ఓ ఊరు సెట్ వేయించాడు సుకుమార్. ఇది సినిమాలో ఎంత బాగా వ‌ర్కవుట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్ర విజ‌యంలో సెట్ కూడా కీల‌క‌పాత్రే. హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ సెట్ వేసారు.
ఇప్పుడు ఇదే సెట్ లో సైరా షూటింగ్ కూడా జ‌ర‌గ‌బోతుంది. అది కూడా భారీ షెడ్యూల్. ఇప్ప‌టికే సైరా యూనిట్ వ‌చ్చి రంగ‌స్థ‌లం సెట్ ను చూసి వెళ్లి.. కావాల్సిన మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ప్ర‌స్తుతం అమెరికా టూర్ కార‌ణంగా సైరా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు మెగాస్టార్. అది పూర్తైన త‌ర్వాత చిరు మ‌ళ్లీ సైరా షూటింగ్ లో అడుగు పెట్ట‌నున్నారు. కొత్త షెడ్యూల్ ను రంగ‌స్థ‌లం సెట్ లోనే ప్లాన్ చేస్తున్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఇప్పుడు చెప్పండి.. చ‌ర‌ణ్ ప్లేస్ పై చిరంజీవి క‌న్నేసాడా లేదా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here