కొణిదెల వారిపిల్ల‌.. పిచ్చెక్కించిందిగా..


ఈ ఫోటో చూసిన త‌ర్వాత ఎవ‌రైనా అనుకునే మాట ఇదే. స‌డ‌న్ గా చూస్తే మ‌నం చూస్తున్న‌ది నిజంగానే నిహారిక‌నా.. లేదంటే ఎవ‌రైనా బాలీవుడ్ హీరోయిన్ నా అనుకోక త‌ప్ప‌దు. అంత‌గా మేకోవ‌ర్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. కొణిదెల వార‌మ్మాయి ఛేంజ్ చూసి షాక్ అవుతున్నారు అభిమానులు కూడా. ఇన్నాళ్లూ ఒక లెక్క‌.. ఇప్ప‌ట్నుంచీ ఒక లెక్క అన్న‌ట్లు.. సీరియ‌స్ గా అవ‌కాశాల కోసం వేట ప్రారంభించింది నిహారిక‌. అందుకే ఈ మేకోవ‌ర్ కూడా. ఇప్ప‌టి వ‌ర‌కు నిహారిక న‌ట‌న‌ను తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా వాడుకోలేద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ భామ హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది. స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు రెస్పాన్స్ బాగానే వ‌చ్చింది. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఇప్పుడు ఈమె కెరీర్ కు హ్యాపీ వెడ్డింగ్ కీల‌కం. ఈ చిత్రానికి ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్న యువీ క్రియేష‌న్స్ బ్యానర్ బ్రాండ్ తో త‌ను కూడా తొలి విజ‌యం అందుకుంటాన‌ని ఆశిస్తుంది నిహారిక‌. ఈ మ‌ధ్యే త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ ఈమె న‌టించిన తొలి సినిమా విజ‌య్ సేతుప‌తితో ఒరు న‌ల్ల‌నాల్ పాతు సొల్రెన్ అనే సినిమాలో న‌టించింది. కానీ ఇది ఫ్లాప్. దాంతో కెరీర్ లో తొలి విజ‌యం కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంది నిహారిక‌. అంత‌లోనే ఇలాంటి మేకోవ‌ర్ తో పిచ్చెక్కించింది కొణిదెల పిల్ల‌. మ‌రి చూడాలిక‌.. ఈ అందం చూసిన త‌ర్వాతైనా ఎవ‌రో ఒకరు నిహారిక‌ను స్టార్ హీరోయిన్ చేయ‌క‌పోతారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here