క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన అన‌సూయ..


ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎవ‌రి నోటా విన్నా కూడా ఒక‌టే మాట వినిపిస్తుంది. అదే క్యాస్టింగ్ కౌచ్. అవ‌కాశాల కోసం అమ్మాయిల‌ను వాడుకోవడం అని దీని అర్థం. అయితే ఇది ప్ర‌తీచోట ఉంటుంది కానీ సినిమా అంటే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ కాబ‌ట్టి ఇక్క‌డ మాత్ర‌మే బ‌య‌టికి వ‌స్తుంది ఈ వ్య‌వ‌హారం ఎక్కువ‌గా అని బ‌య‌ట వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ విష‌యంపై అన‌సూయ కూడా మాట్లాడింది. తెలుగమ్మాయిల‌కు ఆఫ‌ర్లు రావ‌డం లేద‌ని కొంద‌రు రోడ్డెక్కి ర‌చ్చ చేస్తుంటే..
ఓ తెలుగమ్మాయే ఇప్పుడు స్టార్ గా మారిపోయింది. రంగ‌స్థ‌లంలో అన‌సూయ చేసిన రంగ‌మ్మ‌త్త పాత్ర సినిమా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ భామ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. అన్నిచోట్లా ఇది ఉన్నా కేవ‌లం సినిమా ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే ఇది హైలైట్ అవుతుంద‌ని చెప్పింది అన‌సూయ‌. అలా వ‌చ్చిన‌పుడు నీ మూవ్ ఎలా ఉంటుంది.. ఎలా డీల్ చేస్తున్నావ్ అనేదానిపైనే ఇండ‌స్ట్రీలో ముందుకెళ్ల‌డ‌మా..
వెన‌క్కి వెళ్ళ‌డం అనేది ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పింది అన‌సూయ‌. అమ్మాయిలు ధైర్యంగా ఉండాల‌ని.. ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన‌పుడు ముందుకొచ్చి మాట్లాడాల‌ని చెప్పింది అన‌సూయ‌. శ్రీ‌రెడ్డి ఇష్యూపై మాట్లాడుతూ త‌న గురించి క‌మెంట్ ఏం చేయ‌న‌ని.. కేవ‌లం ఆల్ ది బెస్ట్ చెబుతున్నాన‌ని చెప్పింది అన‌సూయ‌. మొత్తానికి ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేద‌ని మాత్రం చెప్ప‌లేదు ఈ భామ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here