క్రైమ్ కామెడీ థ్రిల్లర్ "హల్ చల్" ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన


రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రుద్రాక్ష్ ఉత్కమ్-ధన్యబాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “హల్ చల్”. గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఎనర్జీటిక్ స్టార్ నిఖిల్ విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గణేష్ కొల్లూరి మాట్లాడుతూ.. “కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం “హల్ చల్”. రుద్రాక్ష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీపతి కర్రి అద్భుతమైన కథనంతో, హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకొనే విధంగా సినిమా ఉండబోతోంది. మా సినిమా ఫస్ట్ లుక్ ను ఎనర్జీటిక్ హీరో నిఖిల్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను ప్రకటించి, అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు.
రుద్రాక్ష్ ఉత్కమ్, ధన్యబాలకృష్ణ, కృష్ణుడు, మధునందన్, రవిప్రకాష్, ప్రీతినిగమ్, జెమిని సురేష్, జోగినాయుడు, షణ్ముఖ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: అనిల్&భాను, సహ నిర్మాత: సుజాత బిజిగిరి, లైన్ ప్రొడ్యూసర్: దామోదర్, పాటలు: శతగ్ని-ఇమ్రాన్ శాస్త్రి, పోరాటాలు: నందు మాస్టర్, కళ: ఆర్.కె.రెడ్డి, సంగీతం: హనుమాన్ సి.హెచ్, కూర్పు: ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, నిర్మాత: గణేష్ కొల్లూరి, నిర్మాణం: శ్రీరాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: శ్రీపతి కర్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here