క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో `పంతం`

Gopichand
టాలీవుడ్‌యాక్ష‌న్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. `ఫ‌ర్ ఎ కాస్‌` ఉప శీర్షిక‌. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వకుశ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. గోపీచంద్ న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది. ఈ సినిమాను జూలై 5న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.కె.రాధా మోహ‌న్ మాట్లాడుతూ – “గోపీచంద్‌గారి సిల్వ‌ర్ జూబ్లీ మూవీని మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తుండ‌టం ఆనందంగా ఉంది. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. క్లైమాక్స్ పూర్త‌యిన త‌ర్వాత యు.కెలో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌రిస్తాం. త‌ర్వాత పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమా అవుట్‌పుట్ చ‌క్క‌గా వ‌స్తుంది“ అని తెలిపారు.
గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్ర‌కాష్‌, డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైరెక్ట‌ర్ః బెల్లంకొండ స‌త్యంబాబు, మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌, స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here