క‌ణం.. సాయిప‌ల్ల‌వి ఏం చేస్తుందో..?


సాధారణంగా ఓ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైతే అందులో హీరో ఎవ‌రు.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు అని అడుగుతారు. కానీ సాయిప‌ల్ల‌వి సినిమాలో ఉందంటే మాత్రం అవేవీ అవ‌స‌రం లేదు. ఆమె చూసుకుంటుందిలే అనే న‌మ్మ‌కం ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌నిపిస్తుంది. అంత‌గా త‌న ప‌ర్ఫార్మెన్స్ తో అభిమానుల్ని సంపాదించుకుంది ప‌ల్ల‌వి. ఇప్ప‌టికే ఆమె న‌టించిన అన్ని సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. మ‌ళ‌యాలంలో ప్రేమ‌మ్.. క‌లి, తెలుగులో ఫిదా..
ఎంసిఏ సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు క‌ణం సినిమాతో వ‌స్తుంది సాయిప‌ల్ల‌వి. ఇందులో నాగ‌శౌర్య హీరోగా న‌టించాడు. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ముందు అంచ‌నాలు భారీగా ఉండేవి. కానీ గ‌తేడాది రావాల్సిన సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాలేదు.
దాంతో అంచ‌నాల‌తో పాటు ఆస‌క్తి కూడా త‌గ్గిపోయింది. కానీ ఇన్నాళ్ల‌కు ఎప్రిల్ 27న విడుద‌ల చేయ‌బోతున్నారు ఈ చిత్రాన్ని. ముందు కాలా అనుకున్నా అది పోస్ట్ పోన్ కావ‌డంతో క‌ణంను రంగంలోకి దించుతున్నారు. ప్ర‌మోష‌న్ కూడా బాగా గ‌ట్టిగానే చేస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమా కావ‌డంతో ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇక సాయిప‌ల్ల‌వి కూడా క‌ణం బాధ్య‌త‌ను త‌న భుజాన వేసుకుంది.
ఈ చిత్రం కానీ ఆడితే ప‌ల్ల‌వి కెరీర్లో మ‌రో మైలురాయి వ‌చ్చేసిన‌ట్లే. ఎందుకంటే ఇది సొంత భాష త‌మిళ్ లో సాయిప‌ల్ల‌వి న‌టించిన తొలి సినిమా. పైగా తల్లి పాత్ర‌లో న‌టించింది. బ్రూణ హ‌త్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. మొత్తానికి చూడాలిక‌.. నాగ‌శౌర్య ఛ‌లోతో ఫామ్ లో ఉన్నా అంద‌రి చూపులు మాత్రం సాయిప‌ల్ల‌విపైనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here