క‌ళ్యాణ్ రామ్ కావాల‌నే వేసాడా ఏంటి..?

Kalyan Ram MLA
నంద‌మూరి ఫ్యామిలీ అంటేనే సినిమాల‌తో పాటు రాజ‌కీయాలు కూడా కామ‌న్. వాళ్ల‌కు రెండూ వెన్నెతో పెట్టిన విద్యే. కాక‌పోతే అందులో సినిమాలు అంద‌రికీ అబ్బ‌లేదు. పెద్దాయ‌న త‌ర్వాత ఆయన త‌న‌యుల్లో బాల‌య్య మాత్ర‌మే సూప‌ర్ స్టార్ అయ్యారు. మూడో త‌రం నుంచి ఎన్టీఆర్ ఒక్క‌డే స్టార్ హీరోగా చ‌క్రం తిప్పుతున్నాడు. ఇక క‌ళ్యాణ్ రామ్ ఇప్ప‌టికీ ప‌డుతూ లేస్తూ ప‌య‌నిస్తున్నాడు.
ఇప్ప‌టికే బాల‌య్య‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ట‌చ్ ఇచ్చారు. ఈ లిస్ట్ లో ఒక్క క‌ళ్యాణ్ రామ్ మాత్ర‌మే బ్యాలెన్స్. ఈయ‌న చాలా మంచివాడు అని.. ఎవ‌రి జోలికి వెళ్ల‌డ‌ని చెప్తారు. దానికి త‌గ్గ‌ట్లుగా వివాదాలకు కూడా దూరంగా ఉంటాడు ఈ హీరో. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ట్రైల‌ర్ లో క‌ళ్యాణ్ రామ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానుల‌తో ప‌టు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది.. ఆలోచించేలా చేస్తుంది.. ఆస‌క్తి పెంచేస్తుంది.
నేనింకా రాజ‌కీయాలు మొద‌లుపెట్ట‌లేదు.. మొద‌లుపెడితే మీరు చేయ‌డానికి ఏమీ మిగ‌ల‌వు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు క‌ళ్యాణ్ రామ్. ఇది నిజంగానే సినిమాలో డైలాగా లేదంటే ప‌నిలో ప‌నిగా ప‌ర్స‌న‌ల్ గా కూడా వార్నింగ్ ఇచ్చేసాడా అనే అనుమానం రాక‌మాన‌దు. ఎందుకంటే ఇప్పుడు హ‌రికృష్ణ కుటుంబాన్ని బాల‌య్య‌, చంద్ర‌బాబు కుటుంబాలు పూర్తిగా దూరం పెట్టే సాయి. హ‌రికృష్ణ త‌న‌యులైన ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ కూడా బాబాయ్ కు దూరంగానే ఉన్నారు.
ఇలాంటి టైమ్ లో క‌ళ్యాణ్ రామ్ రాజ‌కీయాలపై ఈ రేంజ్ సెటైరిక‌ల్ డైలాగ్ ఒక‌టి వేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు తెర‌తీస్తుంది. మ‌రి చూడాలిక‌.. ట్రైల‌ర్ లోనే ఇన్ని డైలాగులుంటే రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ర‌చ్చ ఇంకే రేంజ్ లో ఉంటుందో..? ఎమ్మెల్యే మార్చ్ 23న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here