గాయ‌త్రి.. ఆన్ ది వే..!

Gayatri
గాయ‌త్రి.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఈ పేరు బాగా వినిపిస్తుంది. మంచు ఫ్యామిలీలో ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకు రానంత హైప్ క్రేజ్ ఈ చిత్రానికి వ‌చ్చింది. దానికి కార‌ణం మోహ‌న్ బాబు.. అందులో ఆయ‌న గెట‌ప్.. ట్రైల‌ర్స్.. టీజ‌ర్స్.. సాంగ్స్. ఇలా ఏవి తీసుకున్నా కూడా  గాయ‌త్రిలో ఏదో ఉంద‌నే భావ‌న క‌లిగిస్తుంది. ఇన్నాళ్లూ మంచు వారి సినిమాల్లో మిస్ అయిందేదో గాయ‌త్రిలో ప్రేక్ష‌కుల‌కు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. నో డౌట్స్.. ఈ చిత్రానికి క‌చ్చితంగా బెస్ట్ ఓపెనింగ్స్ రావ‌డం ఖాయ‌మైపోయింది. అది కూడా క‌లెక్ష‌న్ కింగ్ ఇమేజ్ పుణ్య‌మా అనే. పురాణాల‌ను కూడా బాగానే ట‌చ్ చేసాడు ఈ చిత్రంలో మోహ‌న్ బాబు. ముఖ్యంగా ఇటు భార‌తం.. అటు రామాయ‌ణంను స్పృషించాడు మోహ‌న్ బాబు. అప్పుడు రాముడు చేసింది త‌ప్పైతే.. ఇప్పుడు నేను చేసింది కూడా త‌ప్పే అంటూ త‌న బేస్ వాయిస్ తో బెద‌ర‌గొట్టాడు మోహ‌న్ బాబు. ఇక ట్రైల‌ర్ లో అయితే మోహ‌న్ బాబు ర‌చ్చ మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. ఈ చిత్రంలో హీరో క‌మ్ విల‌న్ గా రెండు పాత్ర‌ల్లోనూ న‌టించాడు క‌లెక్షన్ కింగ్. చాలా ఏళ్ల త‌ర్వాత ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు మోహ‌న్ బాబు. ఎం ధ‌ర్మ‌రాజు ఎమ్ఏ రేంజ్ లో ఇందులో విల‌న్ గాయ‌త్రి ప‌టేల్ పాత్ర ఉంటుందంటున్నాడు మోహ‌న్ బాబు. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంద‌ని.. అసెంబ్లీ రౌడీ రేంజ్ స్క్రిప్ట్ ఇది అంటున్నాడు మోహ‌న్ బాబు. మ‌ద‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఆ రోజు ఇంటిలిజెంట్ కూడా వ‌స్తుంది. ఇక మ‌రుస‌టి రోజే తొలిప్రేమ కూడా విడుదల కానుంది. అయినా కానీ వ‌చ్చే స్తున్నాడు క‌లెక్ష‌న్ కింగ్. మ‌రి ఈయ‌న దూకుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here