గిటార్ ప‌ట్టుకుని గుండెను మీట‌కే..!


ఇప్పుడు అను ఎమ్మాన్యువ‌ల్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది క‌దా మ‌రి. స్టైల్ గా చేత్తో గిటార్ ప‌ట్టుకుని.. ప్రేక్ష‌కుల గుండెల్లోని తీగ‌లు లాగిన‌ట్లుగా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. పైగా క్యాస్ట్యూమ్ సైజ్ కూడా త‌గ్గించేసి.. అందాల‌న్నీ కెమెరాల‌కు బాగానే అరువిచ్చేస్తుంది అను. ఇప్పుడు ఈ భామ ఆశ‌ల‌న్నీ నా పేరు సూర్య‌పైనే ఉన్నాయి.
ఈ చిత్రంలోనిదే ఈ స్టిల్ కూడా. ఈ సోగ‌క‌ళ్ల సొగ‌స‌రి సైగ‌ల‌కు కుర్రాళ్ళ మ‌తులు చెడిపోతున్నాయి. మ‌జ్నుతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన ఈ మ‌ళ‌యాలి ముద్దుగుమ్మ ఇండ‌స్ట్రీలో అస్తిత్వం కోసం పోరాడుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసిలో న‌టించినా కూడా అమ్మాయిగారికి పెద్ద‌గా హెల్ప్ కాలేదు. గోపీచంద్ ఆక్సీజ‌న్ కూడా డిజాస్ట‌రే.
ఇప్పుడు నా పేరు సూర్య, నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు.. ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది అను ఎమ్మాన్యువ‌ల్. మ‌జ్నులో ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే అందాల బాణాలు వ‌దిలేస్తుంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు ఫోటోషూట్ల‌లో రెచ్చిపోతుంది ఈ కేర‌ళ‌కుట్టి. తాజాగా అమ్మాయి గారు ఓ ఫోటోషూట్ లో చూపుల‌తోనే చంపేస్తున్నారు. ట్రెడీషిన‌ల్ లుక్ తో పాటు త‌న‌లో ఈ మోడ్ర‌న్ యాంగిల్ కూడా ఉంద‌ని ద‌ర్శ‌కుల‌కు హింటిస్తుంది అను ఎమ్మాన్యువ‌ల్. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల‌న్నీ హిట్టైతే.. ఇలా అందాల ఆర‌బోత ప‌రిచేస్తే.. అమ్మో అను ఎమ్మాన్యువ‌ల్ కు ఇంత ఎదురు ఉంటుందా..? పైగా మెగా కంపౌండ్ లోకి కూడా ఎంట‌రైపోయింది. ఆ చ‌లువుతోనైనా ఇప్పుడు అవ‌కాశాలు వ‌స్తాయో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here