గోపీచంద్ పంథం నెగ్గించుకున్నాడుగా..!

Gopichand25
సున్నాకు విలువ లేద‌ని అంతా తీసిపారేస్తారు. కానీ గోపీచంద్ మాత్రం సున్నా విలువ తెలిసి ద‌గ్గ‌ర పెట్టుకుంటాడు. ఈయ‌న కెరీర్ ను మార్చేసింది జీరోనే క‌దా మ‌రి. సున్నాకు వ్యాల్యూ లేదంటే క‌చ్చితంగా గోపీచంద్ కు కోపం వ‌స్తుంది. ఎందుకంటే ఒక్క సున్నా ఈయ‌నకు ఎన్నో విజ‌యాలు తీసుకొచ్చింది. అందుకే జీరో అంటే గోపీచంద్ కు మ‌హా ఇష్టం. ఒక్క‌సారి కూడా సున్నాను వ‌దిలేసి ఉండ‌లేడు.. వ‌దిలేసాడంటే విజ‌యం రాదు. ఒక్కోసారి వ‌చ్చినా కూడా రాదు అది వేరే విష‌యం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే గోపీచంద్ సినిమా టైటిల్స్ లో సున్నా వ‌చ్చిందంటే విజ‌యం కూడా వ‌స్తుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కం. కెరీర్ మొద‌ట్లో జ‌యం, నిజం, వ‌ర్షం లాంటి సినిమాల్లో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు గోపీచంద్. ఈ మూడు సినిమాల్లోనూ సున్నా టైటిల్ లో ఉంది. ఇక హీరోగా మారిన త‌ర్వాత చేసిన తొలి సినిమా య‌జ్ఞం. ఇందులోనూ సున్నా ఉంది.
ఆ త‌ర్వాత ర‌ణం.. ల‌క్ష్యం.. శౌర్యం.. శంఖం.. లౌక్యం.. సాహ‌సం.. సౌఖ్యం.. లాంటి సినిమాలు చేసాడు గోపీచంద్. ఇందులో శంఖం, సౌఖ్యం త‌ప్ప అన్నీ విజ‌యాలే. దీన్నిబ‌ట్టి సున్నా గోపీచంద్ కు ఎంత‌గా క‌లిసొచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు మ‌రోసారి త‌న టైటిల్ సున్నాతో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు గోపీచంద్. ఈయ‌న ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. ఇది గోపీచంద్ కు 25వ సినిమా. దీనికి పంథం అనే టైటిల్ ఖ‌రారు చేసారు. అంటే రెండు సున్నాలున్నాయ‌న్న‌మాట‌. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. మొత్తానికి చూడాలిక‌.. ఈ సారి రెండు సున్నాల‌తో గోపీంచంద్ పంథం ఎంత‌వ‌ర‌కు విజ‌యం సాధిస్తుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here