గోపీసుంద‌ర్.. ఇదే ఇదే ఇదే కావాలి..!


ఇంకేం కావాలి.. అంటూ గీతగోవిందంలో ఓ పాట ఇచ్చాడు గోపీసుంద‌ర్. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ఇచ్చిన పాట‌ల‌తో పోలిస్తే 100 రెట్లు బెట‌ర్ సాంగ్ ఇది. ఒక‌ప్పుడు భలేభ‌లే మ‌గాడివోయ్.. నిన్నుకోరి.. మ‌జ్ను లాంటి ఆల్బ‌మ్స్ ను గోపీ త‌న మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడు. ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ సినిమాల‌తో ఎటూ కాకుండా పోయింది గోపీ సంగీతం. దాంతో ఈయ‌న‌కు కూడా విమ‌ర్శ‌లు త‌ప్ప‌లేదు.
ఇలాంటి టైమ్ లో గీత‌గోవిందం పాట‌తో త‌ను ఇంకా రేస్ లోనే ఉన్నాన‌ని చెప్పాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. మ‌ళ‌యాలం నుంచి వ‌చ్చినా ఇక్క‌డ మంచి పాట‌ల‌నే ఇచ్చి వ‌ర‌స విజ‌యాల‌తో జోరు అందుకున్న గోపీ.. ఆ త‌ర్వాత స‌డ‌న్ గా సైడ్ అయిపోయాడు. ఇప్పుడు మ‌ళ్లీ విజ‌య్ సినిమాతో ఇన్నింగ్స్ కొత్త‌గా మొద‌లు పెడుతున్నాడు. గీత గోవిందం పాట‌కు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. ర‌ష్మిక అందాలు..
విజ‌య్ అప్పియ‌రెన్స్ కు తోడు అనంత శ్రీరామ్ లిరిక్స్ అయితే పిచ్చె క్కిస్తున్నాయి. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మొత్తంగా ఈ పాట‌తో గీత‌గోవిందంపై అలాగే గోపీసుంద‌ర్ పై కూడా అంచ‌నాలు భారీగానే పెరిగిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here