ఘా..ఘా.. మేఘా.. అందాల నిఘా.. 


కొంద‌రు హీరోయిన్ల‌కు విజ‌యాలు ఉండ‌వు కానీ క్రేజ్ మాత్రం బాగానే వ‌చ్చేస్తుంది. మేఘాఆకాశ్ కూడా ఈ లిస్ట్ లోకి వ‌స్తుంది. లై సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ‌.. అది ఫ్లాపైనా ఇమేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమాలో న‌టిస్తుంది ఈ భామ‌. మ‌రోసారి నితిన్ ఈ భామ‌ను చేర‌దీసాడు. ఇంకో అవ‌కాశం ఇచ్చాడు. క‌చ్చితంగా ఈ సారి హిట్ కొట్టి చూపిస్తా అంటుంది మేఘాఆకాశ్. లై సినిమాతో ఇప్ప‌టికే తెలుగులో పాగా వేసింది మేఘా. ఇప్ప‌టికే విడుద‌లైన ఛ‌ల్ మోహ‌న్ రంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్.. పాట‌ల్లో మేఘాను చూసి వావ్ అంటున్నారు. అందాల మేఘాలు క‌రిగి అభిమానుల‌పై వ‌ర్షంగా కురుస్తున్నాయి. పైగా ఈ భామ‌కు అందాల ఆర‌బోత‌లో పెద్ద‌గా ప‌ట్టింపుల్లేవు. ఛ‌ల్ మోహ‌న్ రంగాలోనూ అమ్మాయిగారు చాలా బాగా అందాలు ఆర‌బోస్తున్నారు. రౌడీఫెల్లో ఫేం కృష్ణ‌చైత‌న్య ఛ‌ల్ మోహ‌న‌రంగాకు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి క‌థ త్రివిక్ర‌మ్ అందిస్తున్నాడు. ఇక నిర్మాత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడు. ఆయ‌న‌తో పాటు సుధాక‌ర్ రెడ్డి, త్రివిక్ర‌మ్ కూడా ఉన్నారు. ఎప్రిల్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా విడుద‌లైన ఈమె స్టిల్స్ లో మేఘా ముద్దుముద్దుగా ఆక‌ట్టుకుంటుంది. మొత్తానికి ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమాతో ఈ బ్యూటీ జాత‌కం తెలుగులో ఎలా మార‌నుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here