చారి గారు గ‌ట్టిగా కొట్టేలా ఉన్నారండోయ్..!

‘Achari America Yatra’ To Hit Screens On January 26th, 2018
కొన్ని సినిమాలు విడుద‌ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అంచ‌నాలు ఆస‌క్తి పెంచేస్తుంటాయి. ఈ లిస్ట్ లో ఆచారి అమెరికా యాత్ర కూడా ఉంటుంది. ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత అంచ‌నాలు బాగానే పెరిగిపోయాయి. ఆడోర‌కం ఈడోర‌కం.. దేనికైనా రెడీ లాంటి హిట్స్ త‌ర్వాత విష్ణుతో నాగేశ్వ‌ర‌రెడ్డి చేసిన సినిమా ఇది. ఈ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు. ఇక ఇందులో బ్ర‌హ్మానందం ఆచారి పాత్ర‌లో న‌టించాడు. ఆయ‌న్ని న‌మ్మించి అమెరికా తీసుకెళ్లి.. అక్క‌డ ఎలాంటి తిప్ప‌లు పెట్టార‌నేది అస‌లు క‌థ‌. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ద‌స్ప‌ల్లా హోట‌ల్లో జ‌న‌వ‌రి 20న జ‌ర‌గ‌బోతుంది. ఇక కొన్నాళ్లుగా మున‌ప‌టి స్థాయిలో బ్ర‌హ్మి మాయ చేయ‌లేక‌పోతున్న బ్ర‌హ్మికి.. ఈ చిత్రం కీల‌కం.
అఖిల్, సౌఖ్యం, స‌ర్దార్ లాంటి సినిమాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఖైదీ నెం. 150లో కూడా బ్ర‌హ్మానందం కామెడీ పెద్ద‌గా పేలిందేమీ లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బ్ర‌హ్మానందం కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డాలంటే ఏదైనా అద్భుతం జ‌రగాల్సిందే..! ప్ర‌స్తుతం ఈయ‌నే ప్ర‌ధాన పాత్ర‌లో కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి ఆచారి అమెరికా యాత్ర సినిమా చేస్తున్నాడు విష్ణు ఇందులో హీరో. ప్ర‌గ్యాజైస్వ‌ల్ హీరోయిన్. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ కాంబినేష‌న్లో గ‌తంలో దేనికైనా రెడీ వ‌చ్చింది. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్ర‌. అది కూడా బ్రాహ్మ‌ణ క‌థ ఆధారంగానే వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి అదే చేస్తున్నారు ఈ టీం. జ‌న‌వ‌రి 26న ఆచారి అమెరికా యాత్ర విడుద‌ల కానుంది. మ‌రి మునిగిపోతున్న బ్ర‌హ్మానందం నావ‌ను ఆచారి అయినా ఒడ్డుకు తీసుకొస్తాడో లేదో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here