చావో రేవో తేల్చుకుంటున్న లావ‌ణ్య‌.. 

ఇండ‌స్ట్రీలో అంద‌రికీ టైమ్ వ‌స్తుంది కానీ లావ‌ణ్య త్రిపాఠికి మాత్రం రావ‌ట్లేదు. ఆమె కంటే త‌ర్వాత వ‌చ్చిన హీరోయిన్లు కూడా స్టార్స్ అయిపోయారు కానీ ఆమె మాత్రం అక్క‌డే ఆగిపోయింది. ఒక‌ట్రెండు విజ‌యాలు ఉన్నా కూడా అవి స్టార్ అయ్యేందుకు స‌రిపోవ‌డం లేదు. ఈ మ‌ధ్య అయితే లావ‌ణ్య కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా ఆమె న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాపులే. దాంతో సాధార‌ణంగానే లావ‌ణ్య‌కు ముద్దు పేరు వ‌చ్చేసింది. అదే ఐరెన్ లెగ్ అని. అస‌లు ఈ ఇండ‌స్ట్రీ అంటేనే వైకుంఠపాళి. ఆట తెలిసి పాము అనే ఫ్లాప్ నోట్లో ప‌డ‌కుండా హిట్ అనే నిచ్చెన ఎక్కుతూ వెళ్లిపోవాలి. ఒక్క‌సారి పాము నోట్లో ప‌డితే కింద‌కి జారిపోవాల్సిందే.
ఈ ఆట తెలియ‌కే చాలా ఏళ్లుగా ఇబ్బంది ప‌డుతుంది లావ‌ణ్య త్రిపాఠి. అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు ఎక్కుతుంది కానీ ఎక్కిన నిచ్చెన‌ల కంటే పాము నోట్లోనే ఎక్కువ‌గా ప‌డుతుంటుంది ఈ భామ‌. ఇప్పుడు మ‌రీ దారుణంగా ఆట మొద‌ట్లోనే ఉంది లావ‌ణ్య త్రిపాఠి. పాములు ఎన్నో సార్లు కాటేసిన త‌ర్వాత ఇప్పుడు చివ‌ర‌గా ఒక్క నిచ్చెన ఎక్కాల‌ని చూస్తుంది. ఆ నిచ్చెన పేరు ఇంటిలిజెంట్. సాయిధ‌రంతేజ్ సాయంతో మ‌రోసారి ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాల‌ని చూస్తుంది ఈ భామ‌. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే సాయి కూడా అచ్చంగా లావ‌ణ్య పొజిష‌న్ లోనే ఉన్నాడు. ఈయ‌న కూడా పాము నోట్లో ప‌డి ప‌డి చివ‌రికి నిచ్చెన కోసం ట్రై చేస్తున్నాడు. ఈ ఇద్ద‌రికి ఇంటిలిజెంట్ కీల‌కంగా మారింది. చూడాలిక‌.. లావ‌ణ్య కెరీర్ ను సాయిధ‌రంతేజ్ ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here