చిరంజీవికి అల్లుళ్ల బెడ‌ద..

Sai Dharam Tej

ఒక్క‌రా ఇద్ద‌రా.. ఫ్యామిలీలో 10 మంది హీరోలుంటే ఇలాంటి స‌మ‌స్య‌లే వ‌స్తాయి చిరంజీవికి. ఎప్పుడు ఎవ‌రి వేడుక‌కు రావాల్సి వ‌స్తుందో తెలియ‌దు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. సాయిధ‌రంతేజ్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న తేజ్ ఐ ల‌వ్ యూ ఆడియో వేడుక‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. జూన్ 9న ఈ వేడుక హైద‌రాబాద్ లోనే జ‌ర‌గ‌బోతుంది. జెఆర్సీ క‌న్వెన్ష‌న్ లో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. క‌రుణాక‌ర‌ణ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్.

భలేభ‌లే మ‌గాడివోయ్ ఫేమ్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పోస్ట‌ర్స్ కూడా బాగానే ఉన్నాయంటున్నారు. అయితే తేజ్ కు ఇప్పుడు క‌చ్చితంగా హిట్ అవ‌స‌రం.. ఒక‌టి రెండు కాదు ఏకంగా ఐదు ఫ్లాపులు ఇచ్చాడు వ‌ర‌స‌గా. దాంతో అల్లుడు హిట్ కొడితే కానీ నిల‌బ‌డ‌లేని పొజిష‌న్ లో ఉన్నాడు. దాంతో మామ‌ను కూడా వాడేసుక కుంటున్నాడు సుప్రీమ్ హీరో. మొత్తానికి అటు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత‌..

ఇటు మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ ల‌ను త‌న భుజాల‌పై మోసేందుకు రెడీ అయ్యాడు మెగాస్టార్. తేజ్ ఐ ల‌వ్ యూ నిర్మాత కేఎస్ రామారావు కావ‌డం కూడా చిరు రావ‌డానికి మ‌రో కార‌ణం. ఈయ‌న‌తో చిరంజీవికి ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. జూన్ 29న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here