చిరంజీవికే చేయ‌లేదు.. నితిన్ కు చేస్తున్నాడా..?

అభిమాని లేనిదే హీరోలు లేరులే.. అని ఆ మ‌ధ్య ఓ పాట వ‌చ్చింది. ఇప్పుడు దీనికి అక్ష‌రరూపం ఇస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాను న‌టించిన సినిమాల‌నే ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ప‌వ‌న్ కు ఇష్టం ఉండ‌దు. న‌చ్చితే చూడండి.. లేకపోతే లేదు అంటుంటాడు. అలాంటిది ఇప్పుడు నితిన్ న‌టించిన సినిమాను త‌ను ప్ర‌మోట్ చేస్తున్నాడు ప‌వ‌న్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ చిత్ర నిర్మాత‌ల్లో ప‌వ‌న్ కూడా ఒక‌రు. నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డితో క‌లిసి త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ ఛ‌ల్ మోహ‌న్ రంగ‌ను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను కూడా ప‌వ‌నే లాంఛ్ చేసాడు. కృష్ణ‌చైత‌న్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందించ‌డం మ‌రో విశేషం. ఫిబ్ర‌వ‌రి 14న ఛ‌ల్ మోహ‌న‌రంగ టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఎప్రిల్ 5న సినిమా రానుంది. అయితే ఈ చిత్రంలో మ‌రో ప్ర‌త్యేక‌థ కూడా ఉంది. ఇందులో ప‌వ‌న్ ఓ పాటను పాడుతున్నాడ‌ని తెలుస్తుంది. థ‌మ‌న్ సంగీతంలో ఈ పాట పాడ‌బోతున్నాడు ప‌వ‌ర్ స్టార్. అది కూడా ఛ‌ల్ మోహ‌న‌రంగ టైటిల్ సాంగ్. ఇప్ప‌టికే ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్యే అద్భుత‌మైన లిరిక్స్ రాస్తున్నాడ‌ని తెలుస్తుంది. ప‌వ‌న్ పాడిన పాట‌ల‌న్ని ఇప్ప‌టికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఇప్పుడు త‌న అభిమాని కోసం తొలిసారి పాడుతున్నాడు ప‌వ‌ర్ స్టార్. మ‌రి ఈ పాట ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here