చివరి షెడ్యూల్లో బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల "సాక్ష్యం"


బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. “కాశీ, పోల్లాచి, రాజమండ్రి, న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూజెర్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొన్న సాక్ష్యం ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇటీవల సారధి స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ఫ్యామిలీ సాంగ్ మరియు అన్నపూర్ణ స్టూడియోలో వేసిన మరో సెట్ లో హీరోహీరోయిన్ల నడుమ మరో యుగళ గీతాన్ని చిత్రీకరించాం.
చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లే, ఇటీవల విడుదల చేసిన టీజర్ తోపాటు “సౌందర్య లహరి” అనే మొదటి గీతానికి విశేషమైన స్పందన లభించింది. అన్నీ కమర్షియల్ అంశాలతోపాటు హ్యూమన్ ఎమోషన్స్ మేళవింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీవాస్ నుంచి ఒక కంప్లీట్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చూస్తారు ప్రేక్షకులు. స్క్రీన్ ప్లే సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను ప్రకటించి.. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here