చూపుల‌తో వేటాడేస్తున్న చిరుత‌పిల్ల‌.. 

చిరుత‌పిల్ల‌.. ఈ పేరు ఒక్క ముద్దుగుమ్మ‌కే సాధ్యం. ఆమె నేహాశ‌ర్మ‌.. అప్పుడెప్పుడో ప‌దేళ్ల కింద చ‌ర‌ణ్ కు జోడీగా తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ భామ‌. పూరీ ప‌ట్టుకొచ్చిన ఈ అందం తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత కుర్రాడు లాంటి సినిమాలు చేసినా ఇక్క‌డ నేహాశ‌ర్మ‌కు టైమ్ క‌లిసిరాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్క‌డ కూడా అమ్మాయిగారికి టైమ్ అస్స‌లు క‌లిసి రాలేదు. స్టార్  హీరోల‌తో న‌టించింది కానీ విజ‌యాలు మాత్రం రాలేదు. చివ‌రికి క్రూక్ లాంటి సినిమాల్లో ఇమ్రాన్ హ‌ష్మీతో ముద్దుల వ‌ర్షం కురిపించినా కూడా అదృష్టం మాత్రం త‌లుపు త‌ట్ట‌లేదు. దాంతో ప్రేక్ష‌కులు గుర్తించుకోవాలంటే అందాలు ఆర‌బోయ‌డం త‌ప్ప మ‌రో దారి లేద‌ని డిసైడ్ చేసుకుని అదే దారిలో వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేసింది.. ఇప్ప‌టికీ అదే చేస్తుంది కూడా. పైగా ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాలంటే సోకుల వ‌ల వేయాల్సిందే అని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు హీరోయిన్లు. తాజాగా నేహాశ‌ర్మ కూడా గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొడుతుంది. విదేశాల్లో త‌న సొగ‌సుల వ‌డ్డింపు కానిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఇవి చూసిన త‌ర్వాతైనా నేహాకు ఎవ‌రైనా ఆఫ‌ర్ ఇస్తారేమో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here