చ‌దువైపోయింది.. ఇట్లు మీ నివేదా..

Nivetha
ఒక్క‌సారి ఇమేజ్ వ‌చ్చినా.. డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లు పెట్టినా చ‌దువుపై దృష్టి ప‌క్క‌కెళ్లిపోతుంది. ఇంక గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఉండి స్టార్ హీరోయిన్ ముద్ర ప‌డిన త‌ర్వాత సినిమాలు వ‌దిలేసుకుని మ‌రీ చ‌దువుకోవ‌డం అంటే మాట‌లు కాదు. అది అంతా చేయ‌లేరు. ఆ మ‌ధ్య రిచా గంగోపాధ్యాయ ఇదే చేసింది. సినిమాల‌కు ఉన్న‌ఫ‌లంగా గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయింది.
ఇక ఇప్పుడు నివేదా థామ‌స్ కూడా ఇదే చేసింది. అయితే రిటైర్మెంట్ మాత్రం ఇవ్వ‌లేదు. కొన్నాళ్లుగా ఈ భామ ఏ సినిమా ఒప్పుకోలేదు. ర‌వితేజ‌తో సినిమా అనుకున్నా కూడా దానిపై కూడా క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక శ‌ర్వానంద్ సినిమాను కూడా వ‌దిలేసింది నివేదా థామ‌స్.
దానికి కార‌ణం చ‌దువుపై దృష్టి పెట్టడ‌మే. ఇప్పుడు త‌న డిగ్రీప‌ట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో మ‌ళ్లీ సినిమాల వైపు వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేసింది నివేదా. త్వ‌ర‌లోనే కొత్త సినిమాను అనౌన్స్ చేస్తాన‌ని క్లారిటీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ‌. మ‌రి చూడాలిక‌.. నివేదా డిగ్రీ ప‌ట్టా త‌ర్వాత ఏ సినిమా చేయ‌బోతుందో..? ఎలాంటి క‌థ‌లు విన‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here