చ‌ర‌ణ్ కు మ‌ళ్లీ ఆ ఆశ పుట్టిందా..?


ఐదేళ్ల కింద తొంద‌ర‌ప‌డి ఓ అడుగు వేసాడు చ‌ర‌ణ్. అలా త్వ‌ర‌ప‌డి చేసిన అడుగులు ఎప్పుడూ మంచివి కావ‌ని త్వ‌ర‌గానే తెలుసుకున్నాడు. తాను వేసింది త‌ప్ప‌ట‌డుగు అని కూడా తెలుసుకున్నాడు చ‌ర‌ణ్. అయితే ఆ త‌ప్ప‌ట‌డుగు ఇప్పుడు స‌రిదిద్దుకుంటానంటున్నాడు.
ఆయ‌న చేసిన ఆ త‌ప్పు.. వేసిన త‌ప్ప‌ట‌డుగు పేరు బాలీవుడ్. అవును.. 2013లో ఈయ‌న జంజీర్ సినిమాతో బాలీవుడ్ కు వెళ్లాడు. తొలి సినిమానే ఏకంగా అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాను రీమేక్ చేయ‌డంతో విమ‌ర్శ‌లు కూడా అందుకున్నాడు చ‌ర‌ణ్. సినిమా ఫ్లాప్ అయితే బాగున్ను కానీ మ‌నోడు బ్యాడ్ యాక్ట‌ర్ అనే ముద్ర కూడా ప‌డిపోయింది. దాంతో మ‌రోసారి బాలీవుడ్ వైపు చూడ్డం కూడా మానేసాడు మెగా వార‌సుడు.
ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ ఉత్త‌రాది ఇండ‌స్ట్రీ గురించి మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు రామ్ చ‌ర‌ణ్. త‌న‌కు అక్క‌డ రాజ్ కుమార్ హిరాణి, విశాల్ భ‌ర‌ద్వాజ్ అంటే ఇష్ట‌మ‌ని.. వాళ్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పాడు. అయితే రెండోసారి ప్ర‌య‌త్నం చేస్తే క‌చ్చితంగా మంచి క‌థ‌తోనే వెళ్తాన‌ని.. ఈ సారి వెళ్తే విజ‌యం వ‌చ్చేలా చూసుకుంటాన‌ని చెబుతున్నాడు చ‌ర‌ణ్. అంటే మ‌న‌సులో బాలీవుడ్ కు వెళ్లాల‌ని ఉంది. కానీ ఇప్పుడు కాదు.. క‌థ కుదిర్తే అంటున్నాడు. మ‌రి ఆ క‌థ ఎవ‌రు కుదిరిస్తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here