చ‌ర‌ణ్ కొత్త‌ది మొద‌లుపెట్టాడుగా..!

Ram Charan Happi Mobiles

ఓ ప‌క్క‌న స్కూల్స్ తెరిచి పిల్ల‌లు కూడా బిజీ అయిపోయారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కు కూడా సెల‌వులు అయిపోయాయి. ఈయ‌న కూడా షూట్ కు వెళ్లాల్సిన టైమ్ వ‌చ్చేసింది. కొన్ని రోజులుగా విదేశాలు తిరుగుతూ ఉన్న ఈ హీరో.. ఇప్పుడు బోయ‌పాటి సినిమా కొత్త షెడ్యూల్లో అడుగు పెట్టాడు. హైద‌రాబాద్ లోనే బోయ‌పాటి సినిమా నాలుగో షెడ్యూల్ మొద‌లైంది. చ‌ర‌ణ్ లేకుండానే రెండు షెడ్యూల్స్ కానిచ్చిన ఈ ద‌ర్శ‌కుడు.. వ‌చ్చిన త‌ర్వాత బ్యాంకాక్ లో భారీ షెడ్యూల్ ఒక‌టి పూర్తి చేసుకుని వ‌చ్చాడు.

ఇక ఇప్పుడు హైద‌రాబాద్ లోనే 15 రోజుల పాటు కీల‌క‌మైన ఫ్యామిలీ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌బోతున్నాడు బోయ‌పాటి శీను. ఇందులో కైరా అద్వాని, ప్ర‌శాంత్, స్నేహ‌, ఆర్య‌న్ రాజేశ్ కూడా పాల్గొంటున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దాన‌య్య నిర్మిస్తున్నారు. జ‌య జాన‌కి నాయ‌క ఫ్లాప్ అయినా బోయ‌పాటి మాత్రం ఫెయిల్ కాలేదు. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు చ‌ర‌ణ్ ముందుకెళ్తున్నాడు.

ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. అక్టోబ‌ర్ నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది డిసెంబ‌ర్ లో లేదంటే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌ల కావడం ఖాయం. మ‌రి చూడాలిక‌.. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here