ఛ‌లో.. తొలి వీకెండ్ అదుర్స్.. 

చిన్న సినిమాగా మొద‌లై.. పెద్ద విజ‌యం దిశ‌గా అడుగేస్తుంది ఛ‌లో. అస‌లు విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు హీరో కూడా అనుకుని ఉండ‌డు త‌న మార్కెట్ ఇంత‌గా ఉంద‌ని.. త‌న సినిమాకు ఇంత‌గా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని. కానీ ఇప్పుడు అదే జ‌రుగుతుంది. ఇప్పుడు ఛ‌లో ర‌చ్చ మామూలుగా లేదు. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 6 కోట్ల షేర్ రాబ‌ట్టింది. గ‌తంలో ఏ సినిమా కూడా నాగ‌శౌర్య‌కు ఇంత‌టి ఓపెనింగ్స్ తీసుకురాలేదు. లాజిక్కులు లేని మ్యాజిక్  బాగానే వ‌ర్క‌వుట్ అయింది ఛ‌లోలో. నాగ‌శౌర్య కూడా కెరీర్ లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ చిత్ర జోష్ చూస్తుంటే క‌చ్చితంగా 10 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తుంది. వీక్ డేస్ లో కూడా ఛ‌లో క‌లెక్ష‌న్ల‌లో పెద్ద‌గా మార్పు లేదు.
ఇక ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా ర‌వితేజ ట‌చ్ చేసి చూడును పూర్తిగా డామినేట్ చేస్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే అక్క‌డ హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ మార్క్ అందుకున్నాడు నాగ‌శౌర్య‌. చ‌లో దూకుడు చూస్తుంటే క‌చ్చితంగా 8 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. ఇప్పుడు పెద్ద‌గా పోటీ కూడా లేక‌పోవ‌డంతో క‌చ్చితంగా ఛ‌లో అక్క‌డ పెద్ద విజ‌యం సాధించేలా ఉంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో పెట్టిన డ‌బ్బుల‌న్నీ మూడు రోజుల్లోనే వెన‌క్కి వ‌చ్చేసాయి. ఇప్పుడు వ‌స్తున్న‌వ‌న్నీ లాభాలే. ఈ చిత్రానికి నిర్మాత కూడా నాగ‌శౌర్య‌. వాళ్ల అమ్మ ఉషా మ‌ల్పూరి ఛ‌లో చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు త‌న‌యుడికి వ‌చ్చిన తొలి విజ‌యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు ఉష‌. మొత్తానికి శౌర్య‌కు ఇన్నాళ్ళ త‌ర్వాత మంచి విజ‌యం వ‌చ్చిందన్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here