ఛ‌ల్ మోహ‌న‌రంగ ఏంటి నితిన్ గారూ..? 

ఈ రోజుల్లో టైటిల్ ను బ‌ట్టే సినిమాపై అంచ‌నాలు కూడా పెరిగిపోతుంటాయి. ఇప్పుడు నితిన్ కూడా త‌న సినిమాకు విచిత్ర‌మైన టైటిల్ పెట్టాడు. ఛ‌ల్ మోహ‌న‌రంగ అంటూ ఎవ‌రూ ఊహించ‌ని టైటిల్ తో వ‌చ్చాడు ఈ హీరో. దీనికి గుర్తుందా శీతాకాలం లాంటి రొమాంటిక్ టైటిల్ అనుకున్నారు ముందు కానీ ఏమైందో ఏమో తెలియ‌దు కానీ చివ‌రి నిమిషంలో ఛ‌ల్ మోహ‌న‌రంగ అనేసాడు నితిన్. రౌడీఫెల్లో ఫేమ్ కృష్ణ చైత‌న్య తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది. దీనికి క‌థ అందించింది త్రివిక్ర‌మ్ కావ‌డం విశేషం. అ..ఆ సినిమాతో నితిన్ కు బాగా క‌నెక్ట్ అయిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు ఈయ‌న సినిమాకు క‌థ అందించాడు. ఇక ఈ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి త్రివిక్ర‌మ్, సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తుండ‌టం మ‌రో విశేషం. లై డిజాస్ట‌ర్ తో నితిన్ కు ఈ చిత్ర విజ‌యం కీల‌కంగా మారింది. చ‌ల్ మోహ‌న‌రంగ‌తో హిట్ కొట్టి మ‌ళ్లీ రేస్ లో నిల‌బ‌డాల‌ని చూస్తున్నాడు ఈ హీరో. పైగా ఇది నితిన్ కు 25వ సినిమా కావ‌డం విశేషం.
కృష్ణ‌చైత‌న్య సినిమా ప‌క్కా హిట్ అవుతుంద‌ని నితిన్ ఇంత‌గా న‌మ్మ‌డానికి మ‌రో కార‌ణం త్రివిక్ర‌మ్. అవును.. ఈ సినిమాకు క‌థ అందించింది కూడా త్రివిక్ర‌మే. చాలా రోజుల త‌ర్వాత మ‌రో హీరో సినిమాకు క‌థ అందించాడు మాట‌ల మాంత్రికుడు. అందుకే ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నితిన్. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైంది. అలాగే ల‌వ‌ర్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న టీజ‌ర్ విడుద‌ల కానుంద‌ని చెప్పాడు నితిన్. దాంతో పాటు సినిమా ఎప్రిల్ 5న రానున్న‌ట్లు అనౌన్స్ చేసాడు నితిన్. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న కెరీర్ కు మంచి బ్రేక్ అవుతుంద‌ని ఆశిస్తున్నాడు నితిన్. చూడాలిక‌.. ఈ చ‌ల్ మోహ‌న‌రంగా నితిన్ కెరీర్ ను ఏం చేయ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here