జస్ట్ చిల్ బాస్ అంటున్న అదితి..


అదితిరావ్ హైద్రీ.. ఇదివ‌ర‌కు అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం ఉండేది కానీ ఇప్పుడు కాదేమో..? స‌మ్మోహ‌నం సినిమాతో ఇక్క‌డ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్య వ‌ర‌స సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకుంటుంది.
గ‌త కొంత కాలంగా తెలుగు, హిందీ, త‌మిళ్ లో సినిమాలు చేస్తుంది అదితి. మ‌ణిర‌త్నం న‌వాబ్ సినిమాలో కూడా న‌టిస్తుంది ఈ భామ‌. ఇంత బిజీగా ఉండ‌టంతో కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయింది అదితిరావ్. ప్ర‌స్తుతం ఫారెన్ టూర్ లో ఉన్న అదితి.. అక్క‌డ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ట్విట్ట‌ర్ లో ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. అక్క‌డా అందాల ఆర‌బోత మాత్రం మాన‌డం లేదు అదితి రావ్. ఎంతైనా బాలీవుడ్ ప్రాణం క‌దా..
అల‌వాటు ప‌డిన ప్రాయం అంత ఈజీగా అందాలు చూపించ‌కుండా వ‌ద‌ల‌దు. కేవ‌లం న‌ట‌నే కాదు.. అందాల ఆర‌బోత‌లో కూడా అమ్మాయిగారికి అస్స‌లు అడ్డంకులు లేవు. కాక‌పోతే స‌మ్మోహ‌నంలో అలాంటి పాత్ర కాబ‌ట్టి ఆ వైపు వెళ్ల‌లేదంతే. ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టిస్తుంది అదితి. దానికితోడు మ‌రో రెండు మూడు సినిమాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ ముద్దుగుమ్మ ర‌చ్చ తెలుగు ఇండ‌స్ట్రీలో ఎలా ఉండ‌బోతుందో..?
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here