జులై 31న 4.30 నిమిషాల‌కి న‌ర్త‌న‌శాల మెద‌టి సింగిల్ కి రెడి అవుతున్న ఐరా క్రియేష‌న్స్‌


ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల మెద‌టి లుక్ ని విడుద‌ల‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈలుక్ కి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ చిత్రం లో క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఇట‌లీలో సాంగ్స్ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రోడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రంలో జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, శివాజి రాజా, జెమిని సురేష్‌, రాఘ‌వ‌, రాకెట్ రాఘ‌వ మంచి పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి, చిత్ర నిర్మాత ఉష మూల్పూరి. ఛ‌లో లాంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి చాలా మంచి సంగీతాన్ని అందించారు. ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. జులై 31న 4.30 నిమిషాల‌కి మెద‌టి సింగిల్ ని విజువ‌ల్ గా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అగ‌ష్టు 31న విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ఛ‌లో చిత్రాన్ని మ్యూజిక‌ల్ గా ఎంత ఘ‌న‌విజ‌యం చేశారో అంద‌రికి తెలుసు. ఇప్ప‌డు మా @న‌ర్త‌నశాల ని కూడా అంత‌కు మించి విజ‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మెద‌టి సింగిల్ ని జులై 31న 4.30 నిమిషాల‌కి విడుద‌ల చేయ‌టానికి నిర్ణ‌యించాం. అలాగే ఈచిత్ర ఆడియో మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అద్బుతంగా చేశాడు. ఛ‌లో కంటే మంచి విజ‌యాన్ని అందుకుంటామ‌న్న న‌మ్మ‌కం వుంది. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు. మా దృష్టిలో సినిమా అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందుకే మా ఐరా క్రియెష‌న్స్ నుండి వ‌చ్చిన ఛ‌లో కూడా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేశాము. ఇప్పుడు మా @న‌ర్త‌న‌శాల కూడా పూర్తి వినోదాత్మ‌కంగా తీర్చిదిద్దాము. ఈ చిత్రం వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని , అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంది. మా హీరో నాగ‌శౌర్య చాలా అందంగా క‌న‌ప‌డ‌తాడు. చాలా మంచి పాత్ర చేస్తున్నాడు. అలాగే హీరోయిన్స్ క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ లు చాలా బాగా నటించారు. ఈచిత్రంలో ఎవ‌రి పాత్ర‌కి వారు క‌రెక్ట్ గా స‌రిపోయారు. ఎగిరినే మ‌న‌సు అని సాగే సాంగ్ విజువ‌ల్ ని విడుద‌ల చేస్తున్నాము. ఈ సాంగ్ అంద‌ర్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంద‌ని మా న‌మ్మ‌కం. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 31న విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.
 
న‌టీన‌టులు..
నాగ‌శౌర్య‌, క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు న‌టించ‌గా..
 
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాత‌.. ఉష మూల్పూరి
లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి
ఐరా డిజిట‌ల్‌– ఎమ్‌.ఎన్‌.ఎస్ గౌత‌మ్‌
డి ఓ పి.. విజ‌య్ సి కుమార్‌
సంగీతం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్
ఎడిట‌ర్‌.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, త‌మ్మిరాజు
స్క్రిప్ట్ అసోసియోట్‌.. కాశి న‌డింప‌ల్లి
పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌.. అనంత్‌
ఆర్ట్‌.. కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్‌.. విజ‌య్ , మ‌ల్లేష్‌
కొరియోగ్ర‌ఫి.. విశ్వ ర‌ఘు, విజ‌య్ ప్ర‌కాష్‌,
లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, శ్రీమ‌ణి, ఒరుగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here