జూన్ 1న బాక్సాఫీస్ యుద్ధం..


ఒక్కరోజు.. నాలుగు సినిమాలు.. జూన్ 1న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ స‌మ‌రానికి స‌మ‌యం స‌న్న‌ద్ద‌మ‌వుతుంది. ఆ రోజు ఏకంగా నాలుగు క్రేజీ సినిమాలు విడుద‌ల కానున్నాయి. అన్నింట్లోనూ చెప్పుకోద‌గ్గ హీరోలే ఉన్నారు. దాంతో ఎవ‌రు ఎవ‌రితో పోటీ ప‌డుతున్నారో అర్థం కావ‌డం లేదు. ముందుగా జూన్ 1న నాగార్జున ఆఫీస‌ర్ రాబోతుంది. ఇమేజ్ ప‌రంగా చూసుకుంటే ఆ రోజు వ‌స్తున్న సినిమాల్లో ఇదే పెద్ద సినిమా.
వ‌ర్మ ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచ‌నాలు అయితే పెద్ద‌గా లేవు కానీ తీసిపారేసేంత సినిమా అయితే కాదు. ఇక అదే రోజు వ‌స్తోన్న మ‌రో సినిమా విశాల్ అభిమ‌న్యుడు. ఈ చిత్ర త‌మిళ్ వ‌ర్ష‌న్ ఇరుంబు తిరై ఇప్ప‌టికే అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్. దాంతో అదే అంచ‌నాలు తెలుగులోనూ కొన‌సాగుతాయి. పైగా విశాల్ సినిమాల‌కు మాస్ ప్రేక్ష‌కుల నుంచి స్పంద‌న బాగానే ఉంటుంది. బి, సి సెంట‌ర్ల‌లో ఈయ‌న సినిమాలు మంచి వ‌సూళ్లు తీసుకొస్తుంటాయి.
ఇదిలా ఉంటే ఇదే రోజు క‌ళ్యాణ్ రామ్ నా నువ్వే కూడా విడుద‌ల కానుంది. క్లాస్ సినిమాగా వ‌స్తున్నా కూడా త‌మ‌న్నా అందాలు బోన‌స్ కానున్నాయి. ఇక వీళ్ళ‌తో పాటే రాజుగాడు అంటూ రాజ్ త‌రుణ్ కూడా రానున్నాడు. ఈయ‌న సినిమా కూడా కామెడీ బేస్డ్ గానే వ‌స్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ నాలుగు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విన్న‌ర్ అవుతుందో.. ఏది లూజ‌ర్ అవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here