జై సింహా.. మాస్.. ఊర‌మాస్.. 

Jai Simha Audio On Dec 24 At Vajra Grounds, Vijayawada – Grand Release On Jan 12, 2018
మాస్ అనే ప‌దానికి బాల‌య్య నిద‌ర్శ‌నం. ఆయ‌న ఏం చేసినా ఎక్స్ ట్రీమ్ లెవ‌ల్లో ఉంటుంది. ఈయ‌న వ‌య‌సు 60కి చేరువైంది కానీ మ‌న‌సు మాత్రం ఇంకా 20ల్లోనే ఆగిపోయింది. అందుకే ఆయ‌న‌లో అంత జోరు క‌నిపిస్తుంటుంది. లేక‌పోతే మ‌రేంటి.. ఇప్ప‌టికీ సినిమా సినిమాకు ఆయ‌న వేస్తోన్న డాన్సులు.. చేస్తోన్న యాక్ష‌న్ స్టంట్లు చూస్తుంటే దుమ్ము లేసిపోతుంది.. మ‌తులు చెడిపోతున్నాయి. ఇప్పుడు జై సింహా టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో కూడా అదిరిపోయే యాక్ష‌న్ సీన్ లు చేసాడు బాల‌య్య. టీజ‌ర్ మొద‌ట్లోనే సింహం డైలాగ్ చెప్పి ప‌ది మందిని గాల్లో ఎగిరి కొట్టేసాడు నంద మూరి న‌ట‌సింహం. కేఎస్ ర‌వికుమార్ ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ను అభిమానుల కోసం సిద్ధం చేస్తున్నాడు. జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో న‌య‌న‌తార మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. న‌టాషాదోషి, హ‌రిప్రియ మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లుగా న‌టించారు. ఆడియో వేడుక విజ‌య‌వాడ‌లో డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. ఇక ఈ నెల 28న సెన్సార్ పూర్తి చేసుకోనుంది ఈ చిత్రం. విడుద‌ల‌కు 15 రోజుల ముందే ఫ‌స్ట్ కాపీ రెడీ చేసుకుంటున్నాడు బాల‌య్య‌. మొత్తానికి టీజ‌ర్ తో ప‌క్కా మాస్ ప‌వ‌ర్ చూపించిన బాల‌య్య‌.. రేపు సినిమాలోనూ ఇదే జోరు కంటిన్యూ చేస్తాడేమో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here