ఝాన్వీని చూస్తుంటే దిల్ ధ‌డ‌క్..

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది ముద్దుగుమ్మ‌లున్నా.. అతిలోక‌సుంద‌రి మాత్రం ఒక్క‌రే. ఆమె శ్రీ‌దేవి. ఎన్నాళ్లైనా.. ఎన్నేళ్లైనా శ్రీ‌దేవిపై ఉన్న అభిమానం మాత్రం త‌గ్గ‌దు. ఇప్పుడు ఆమె భౌతికంగా లేక‌పోయినా ఆమె వార‌స‌త్వం మాత్రం ఇండ‌స్ట్రీలోనే ఉంది.

శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వి న‌టిస్తోన్న తొలి సినిమా ధ‌డ‌క్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. అచ్చం అమ్మ‌లాగే ఉంది ఈ భామ కూడా. ఈ చిత్రం కోసం చాలా మేకోవ‌ర్ అయిపోయింది జాన్వి. మ‌రాఠీలో సూప‌ర్ హిట్ అయిన సైరాత్ సినిమాకు రీమేక్ ఇది. శ‌శాంక్ కైథాన్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాతో ఇషాన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ ఫ‌స్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది.

ఈ ఫ‌స్ట్ లుక్ కు ముందే అమ్మ‌డు ఫుల్ గా ఎక్స్ పోజింగ్ చేసుకుంటూ ముంబై వీధుల్లో తిరిగేస్తుంది. అస‌లు ఝాన్వీ ర‌చ్చ చూసి అంతా షాక్ అవుతున్నారు. శ్రీ‌దేవి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని త‌న కూతుర్ని క‌ర‌ణ్ జోహార్ చేతుల్లో పెట్టింది. పాపం ఆ సినిమా చూడ‌కుండానే ఆమె పైకి వెళ్లిపోయింది. అయితే జాన్వి ప‌రిచ‌యానికి సైరాత్ సరైన సినిమా కాదేమో అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అస‌లు సైరాత్ లో అంత‌గా చెప్పుకోద‌గ్గ విష‌యం ఏమీ లేద‌ని.. ఆ టైమ్ లో మ‌రాఠీయుల‌కు ఆ సినిమా ఎందుకో క‌నెక్ట్ అయిపోయిందంతే.. హిందీలో సైరాత్ క్లిక్ అవ్వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. మ‌రి చూడాలిక‌.. శ్రీ‌దేవి మాదిరిగానే తొలి చిత్రంతో జాన్వి కూడా అద‌ర‌గొడుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here